మళ్లీ క్రికెట్ పాలనా వ్యవహారాల్లోకి గంగూలీ
- ఇటీవల బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీకాలం పూర్తిచేసుకున్న దాదా
- అప్పటి నుంచి క్రికెట్ వ్యవహారాలకు దూరం
- తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు డైరెక్టర్ గా నియామకం
భారత క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ ఇటీవలే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడిగా పదవీకాలం పూర్తిచేసుకున్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీవిరమణ చేసిన తర్వాత గంగూలీ ఇప్పటిదాకా క్రికెట్ వ్యవహారాల జోలికి వెళ్లలేదు. అయితే, ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు డైరెక్టర్ (హెడ్ ఆఫ్ క్రికెట్) గా గంగూలీ మళ్లీ క్రికెట్ పాలనా వ్యవహారాల్లోకి అడుగుపెట్టనున్నారు.
2019లో గంగూలీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సలహాదారుగా వ్యవహరించారు. అదే ఏడాది బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో గంగూలీ ఐపీఎల్ పదవి నుంచి వైదొలిగారు. ఇక బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ పదవీకాలం ఇటీవలే ముగియగా, బోర్డుకు కొత్త అధ్యక్షుడిగా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ వచ్చారు.