పంత్ కారులో దొరికిన రూ.4 వేలు పోలీసులకు అప్పగించిన యువకులు

  • ఇటీవల రిషబ్ పంత్ కు యాక్సిడెంట్
  • కాలిపోయిన పంత్ కారు
  • కారులోంచి లగేజి, డబ్బు బయటికి తీసిన యువకులు
  • ఆ సమయంలో డబ్బు అప్పగించడం మర్చిపోయిన యువకులు
టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ యాక్సిడెంట్ కు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పంత్ నడుపుతున్న బెంజ్ కారు అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లి, ఆపై మంటల్లో చిక్కుకుంది. కాలిపోతున్న కారు నుంచి పంత్ ను హర్యానా ఆర్టీసీ డ్రైవర్ బయటికి తీసుకువచ్చారు. 

ఈ క్రమంలో పంత్ కు రజత్ కుమార్, నిషు కుమార్ అనే యువకులు కూడా సాయపడ్డారు. కాలిపోతున్న కారు నుంచి పంత్ వస్తువులు, రూ.4 వేల నగదును బయటికి తీసుకొచ్చారు. అయితే, ఆ యువకులిద్దరూ పంత్ కారులో తమకు దొరికిన రూ.4 వేలను పోలీసులకు అప్పగించారు. ఆ యువకులు నిజాయతీగా డబ్బు అప్పగించడం పట్ల పోలీసులు అభినందించారు. 

ఆ యువకులు డెహ్రాడూన్ వెళ్లి మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పంత్ ను పరామర్శించారు. పంత్ ను వైద్యులు ఐసీయూ నుంచి ప్రైవేట్ వార్డుకు మార్చగా, వారిద్దరూ పంత్ తో మాట్లాడారు. 

ఈ సందర్భంగా ఆ యువకులు మీడియాతో మాట్లాడుతూ, ప్రమాదం జరిగిన సమయంలో కారులో లగేజి, డబ్బు గుర్తించామని వెల్లడించారు. ఘటన స్థలంలోనే పోలీసులకు లగేజి అప్పగించామని, ఆ హడావుడిలో డబ్బు ఇవ్వడం మర్చిపోయామని తెలిపారు.


More Telugu News