యుక్త వయసులోనే తెల్ల వెంట్రుకలా.. ఎందుకిలా?
- కారణాలేంటో తెలుసుకుని చర్యలు తీసుకోవాలి
- వంశపారంపర్యం, పోషకాహార లోపం, ఒత్తిడితో సమస్య
- అన్నిపోషకాలు అందేలా ఆహారం తీసుకోవాలి
నడి వయసు దాటిన తర్వాత వెంట్రుకలు క్రమంగా తమ రంగును కోల్పోవడం సర్వ సాధారణం. కానీ, 30 ఏళ్లకే వెంట్రుకలు నెరిస్తే చూడ్డానికి అంత బాగుండదు. ఈ విషయంలో అయితే బెంగ పడే వారూ ఉంటారు. ఆత్మ విశ్వాసం పైన దీని ప్రభావం పడుతుంది.
మన వయసును చెప్పేది మన శిరోజాలే. యవ్వనంగా కనిపించాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. మరి వయసు ముదిరిన వారి మాదిరిగా యుక్త వయసుకే శిరోజాలు రంగును కోల్పోతుంటే పట్టించుకోవాల్సిందే. దీని వెనుక వంశపారంపర్యంగా, పురుష హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి కావడం, సమతుల, పోషకాహారం తీసుకోకపోవడం కారణాలు అయి ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కనుక జుట్టు నెరవడాన్ని నిలిపివేయడానికి కేవలం ఆహారపరమైన మార్పులు ఒక్కటే కాకుండా మరికొన్ని చర్యలు కూడా తీసుకోక తప్పదని పోషకాహార నిపుణులు అంజలీ ముఖర్జీ తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ రూపంలో తెలియజేశారు.

- కుంకుడు కాయలు, షీకాకాయలను నాన బెట్టి, నానిన తర్వాత ఉడకబెట్టాలి. ఈ లిక్విడ్ ను షాంపూగా వాడుకోవాలి.
- ఎండిన ఉసిరికాయలను ఒక రాత్రంతా నీళ్లలో నానబెట్టి, ఈ లిక్విడ్ ను కండీషనర్ గా వాడుకోవాలి.
- ఎలాంటి ఒత్తిడి అయినా జుట్టు రంగు నెరవడానికి దారితీస్తుంది. కనుక ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రాణాయామం, యోగా చేయాలి. లేదంటే హోమియోపతి లేదా అల్లోపతి ఔషధాల సాయం తీసుకోవాలి.
- కూరగాయలను కావాల్సిన పరిమాణంలో తీసుకోవాలి. రోజువారీ కనీసం రెండు రకాల పండ్లు తినాలి. లేదంటే రసం చేసుకుని తాగొచ్చు.
- ప్రొటీన్ చాలా ముఖ్యం. గుడ్లు, చికెన్, ముడి ధాన్యాలు, పప్పులను ఆహారంలో భాగంగా తీసుకోవాలి.
- ఆర్టిఫీషియల్ ప్రిజర్వేటివ్ లు ఉన్న ఆహారాన్ని తీసుకోవద్దు. వీటివల్ల జీర్ణాశయంపై ఒత్తిడి పడుతుంది.