ఫ్రాన్స్ లో కుర్రకారుకి ఉచితంగా కండోమ్ లు
- వయసు 25లోపు ఉంటే చాలు ఉచితంగా తీసుకెళ్లొచ్చు
- లైంగిక వ్యాధులు, అవాంఛిత గర్భధారణలకు కళ్లెం వేసే చర్య
- కేవలం పురుష కండోమ్ లే ఉచిత సరఫరా
మీరు వింటున్నది నిజమే. తమ దేశంలో యువ పురుషులకు ఉచితంగా కండోమ్ లు సరఫరా చేయాలని ఫ్రాన్స్ నిర్ణయం తీసుకుంది. 25 ఏళ్లు, అంతకులోపు వయసున్న వారికి జనవరి 1 నుంచి ఉచితంగా కండోమ్ లను అందించడాన్ని ప్రారంభించింది. అవాంఛిత గర్భధారణలు, సుఖవ్యాధులు (లైంగిక చర్య ద్వారా సంక్రమించే వ్యాధులు) నివారించేందుకే ఇలా చేస్తోంది.
తొలుత 18-25 ఏళ్ల వయసు వారికే అని అక్కడి సర్కారు ప్రకటించింది. మైనర్లకు రక్షణ వద్దా? అన్న విమర్శలు రావడంతో 25 ఏళ్లలోపు మగవారు అందరికీ ఇవ్వాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. అధ్యక్షుడు మెక్రాన్ ఆధ్వర్యంలోని సర్కారు ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని డిసెంబర్ లో తీసుకోగా, జనవరి 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. మరోపక్క, లైంగిక విద్య విషయంలో ఫ్రాన్స్ మెరుగ్గా పనిచేయడం లేదని అధ్యక్షుడు మెక్రాన్ అంగీకరించారు. ‘‘థియరీ కంటే వాస్తవికత ఎంతో దూరంలో ఉంది. ఈ విషయంలో టీచర్లకు ముందుగా శిక్షణ ఇవ్వాలి’’ అని మెక్రాన్ పేర్కొన్నారు.
పురుషుల కండోమ్ లనే ఉచితంగా అందిస్తారు. ఈ కండోమ్ లను 25 ఏళ్ల వయసు వరకు పురుషులతోపాటు, మహిళలకూ ఇస్తారు. యూత్ గ్రూప్ లకు ఇప్పటికే వీటిని పంపిణీ చేయగా, స్కూళ్లలోనూ అందుబాటులో ఉంచారు. ఫ్రాన్స్ లో 2021లో కొత్తగా 5,000 హెచ్ఐవీ కేసులు వెలుగు చూశాయి. ఇందులో 15 శాతం మంది వయసు 25 ఏళ్లలోపుగా ఉంది. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఫ్రాన్స్ లో 25 ఏళ్ల లోపు యువతులకు గర్భనిరోధక మాత్రలను గడిచిన ఏడాదిగా ఉచితంగానే అందిస్తున్నారు. అంతకుముందు 18 ఏళ్లలోపు వారికే వీటిని ఇచ్చేవారు.