నిరాహార దీక్ష చేస్తున్న హరిరామజోగయ్యకు పవన్ కల్యాణ్ ఫోన్

  • కాపు రిజర్వేషన్ల కోసం హరిరామజోగయ్య నిరాహార దీక్ష
  • భగ్నం చేసిన పోలీసులు
  • ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
  • దీక్షలను ఈ మూర్ఖపు ప్రభుత్వం పట్టించుకోదన్న పవన్
సీనియర్ రాజకీయవేత్త చేగొండి హరిరామజోగయ్య కాపు రిజర్వేషన్ల సాధన కోసం నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. 85 ఏళ్ల హరిరామజోగయ్య నిరాహార దీక్షకు దిగడం పట్ల ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వం ఆయన దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించింది. 

ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. నిరాహార దీక్ష చేస్తున్న హరిరామజోగయ్యకు ఫోన్ చేసి మాట్లాడినట్టు వెల్లడించారు. ఈ మూర్ఖపు ప్రభుత్వం నిరాహార దీక్షలకు లొంగదని ఆయనకు చెప్పానని వివరించారు. వయసు, ఆరోగ్యం దృష్ట్యా దీక్ష విరమించాలని సూచించినట్టు తెలిపారు. 

కాగా, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో దీక్షకు దిగిన హరిరామజోగయ్యను పోలీసులు ఆయన కూర్చున్న కుర్చీతో సహా అంబులెన్స్ లోకి ఎక్కించి తరలించారు. ఆయన ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు.


More Telugu News