సీఎం జగన్ ను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి... విమర్శలపై వివరణ

  • ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసిన కోటంరెడ్డి
  • 2,700 పెన్షన్లు తొలగించారంటూ వ్యాఖ్యలు
  • ఆర్థిక కార్యదర్శి రావత్ పైనా విమర్శలు
  • నియోజకవర్గంలో రోడ్లు సరిగా లేవని వెల్లడి
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేడు సీఎం జగన్ ను కలిశారు. ఇటీవల తాను చేసిన విమర్శల పట్ల వివరణ ఇచ్చారు. ఇటీవల కోటంరెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు వైసీపీకి ఇబ్బందికరంగా మారినట్టు తెలుస్తోంది. 

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2,700 పెన్షన్లు తొలగించారంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి రావత్ పైనా వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో రోడ్లు సరిగా లేవని అన్నారు. ఈ వ్యాఖ్యలన్నీ ప్రభుత్వ వ్యతిరేక కోణంలో ప్రచారమయ్యాయి. 

ఈ నేపథ్యంలోనే సీఎం కార్యాలయం నుంచి కోటంరెడ్డికి పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ మధ్యాహ్నం సీఎంను కలిసిన కోటంరెడ్డి... విమర్శలు ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరించారు.


More Telugu News