పోలీస్ రిక్రూట్ మెంట్ నిబంధనలను ఎందుకు మార్చారు?: బండి సంజయ్

  • నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న బండి సంజయ్
  • పోలీస్ అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపాటు
  • ఇప్పటికైనా నిబంధనలను మార్చాలని డిమాండ్
రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నిబంధనలకు వ్యతిరేకంగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని... పోలీసు అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. పరీక్షల్లోని లోపాలు, అవకతవకలను సవరించాలని లక్షలాది మంది అభ్యర్థులు కోరుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. శరీర దారుఢ్య పరీక్షల నిబంధనలను వెంటనే సరిదిద్దాలని డిమాండ్ చేశారు. 

లాంగ్ జంప్, షార్ట్ పుట్ పరీక్షల్లో ఏ రాష్ట్రంలోనూ లేని నిబంధనలను పొందుపరిచారని అన్నారు. ఆర్మీ రిక్రూట్ మెంట్ లో కూడా ఈ స్థాయిలో నిబంధనలు లేవని చెప్పారు. చాలా రాష్ట్రాల్లో లాంగ్ జంప్ డిస్టెన్స్ 3.8 మీటర్లు ఉండగా తెలంగాణలో మాత్రం 4 మీటర్లుగా నిర్ణయించారని విమర్శించారు. 4 మీటర్లుగా నిర్ణయించడం వెనుక ఉన్న శాస్త్రీయత ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా నిబంధనలను మార్చాలని... లేకపోతే ప్రభుత్వాన్ని యువత క్షమించదని చెప్పారు.


More Telugu News