సిద్ధిపేట వెంకటేశ్వరస్వామి ఆలయానికి బంగారు కిరీటం సమర్పించిన మంత్రి హరీశ్ రావు

సిద్ధిపేట వెంకటేశ్వరస్వామి ఆలయానికి బంగారు కిరీటం సమర్పించిన మంత్రి హరీశ్ రావు
  • ఇవాళ వైకుంఠ ఏకాదశి
  • వెంకటేశ్వరస్వామి కోసం 1.792 కిలోల కిరీటం తయారీ
  • కిలో బంగారం సమకూర్చిన ఆలయ వర్గాలు
  • మిగిలిన బంగారం అందించిన హరీశ్ రావు, ఇతర దాతలు
ఇవాళ వైకుంఠ ఏకాదశి. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి హరీశ్ రావు వెంకటేశ్వరస్వామి వారి పట్ల భక్తిప్రపత్తులు చాటుకున్నారు. సిద్ధిపేటలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయానికి బంగారు కిరీటం సమర్పించారు. 

ఈ కిరీటం తయారీలో ఆలయ వర్గాలతో పాటు హరీశ్ రావు కూడా పాలుపంచుకున్నారు. ఈ స్వర్ణ కిరీటం బరువు 1.792 కిలోలు కాగా, ఇందులో కిలో బంగారం ఆలయ వర్గాలు కొనుగోలు చేయగా, మిగిలిన బంగారం హరీశ్ రావు తదితర దాతలు సమకూర్చారు. ఈ పసిడి కిరీటం విలువ కోటి రూపాయలకు పైనే ఉంటుందని అంచనా. 

ఇవాళ సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి విచ్చేసిన మంత్రి హరీశ్ రావు... కిరీటాన్ని ఆలయ పీఠాధిపతికి అందించారు. స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేశారు.


More Telugu News