ఆరోగ్యం కోసం ఆహారంలో ప్రత్యామ్నాయాలు ఇవి

  • కొన్ని మార్పులు చేసుకుంటే చాలు మంచి ఫలితాలు
  • మైదాకు బదులు రాగి, జొన్న పిండి మంచివి
  • చక్కెరకు తేన మంచి ప్రత్యామ్నాయం
  • రిఫైన్డ్ నూనెల కంటే నెయ్యి నయం
మనం రోజవారీ జీవితంలో భాగంగా ఆహారంలో ఎన్నో రకాల పదార్థాలను చేరుస్తూ వినియోగిస్తుంటాం. రుచి కోసం, రంగు, మంచి సువాసన కోసం ఇలా చేస్తుంటాం. కానీ, కొన్నింటి వల్ల ఆరోగ్యానికి మంచి కంటే హాని ఎక్కువ. అందుకని కొన్నింటి విషయంలో వాటి కంటే మెరుగైన ప్రత్యామ్నాయాలను పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు.. 

  • సహజసిద్ధ తేనెను తీసుకుంటే పంచదార మాదిరి ఒకేసారి రక్తంలో గ్లూకోజ్ పెరిగిపోదు. కాకపోతే ప్రాసెస్ చేయని తేనెనే ఇందుకు వినియోగించాలి.
  • ఇక మనం వినియోగించే పాశ్చురైజ్డ్ పాల కంటే కూడా కొబ్బరి పాలు ఎంతో నయం.
  • నెయ్యిలో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువని చెబుతుంటారు. నిజానికి రిఫైన్డ్ సీడ్ ఆయిల్స్ కంటే కూడా నెయ్యి మంచి ప్రత్యామ్నాయం. 
  • రసాయన ఆధారిత ఫ్లేవర్స్ కంటే ఇలాచీ, దాల్చిన చెక్క, కుంకుమ పువ్వు అంటి సహజ సిద్ధమైన వాటిని ఉపయోగించుకోవచ్చు. 
  • మైదా మన ఆరోగ్యానికి బలమైన శత్రువు. ఇందులో కార్బో హైడ్రేట్లు తప్ప మరే పోషకాలు లేవు. పీచు కూడా లేకపోవడంతో తిన్న తర్వాత కార్బోహైడ్రేట్లు అన్నీ ఒకేసారి రక్తంలోకి చేరిపోతాయి. దీంతో బ్లడ్ షుగర్ పెరిగిపోతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా రాగి పిండి, జొన్న పిండిని ఉపయోగించుకోవచ్చు.
  • మధుమేహం లేని వారు బెల్లం తీసుకోవచ్చు. మధుమేహం ఉన్న వారు బెల్లం బదులు ప్రత్యామ్నాయంగా ఎండు ఖర్జూరను ఉపయోగించుకోవచ్చు.


More Telugu News