రతన్ టాటాకు అత్యంత సన్నిహితుడైన కృష్ణకుమార్ కన్నుమూత

  • 1963లో టాటా గ్రూపులో అడుగుపెట్టిన కృష్ణకుమార్
  • గ్రూపులోని పలు కంపెనీలకు టాప్ పొజిషన్ లో పని చేసిన వైనం
  • ఈ సాయంత్రం ముంబైలో అంత్యక్రియలు
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు అత్యంత సన్నిహితుడైన ఆర్. కృష్ణకుమార్ కన్నుమూశారు. ఆయన వయసు 84 ఏళ్లు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కేరళలోని తలస్సెరీలో ఆయన పుట్టి పెరిగారు. చెన్నైలో ఉన్నత చదువులు చదివారు. టాటా గ్రూప్ లో 1963లో అడుగుపెట్టిన ఆయన... టాటా సన్స్ కు డైరెక్టర్ గా కూడా పని చేశారు. టాటా గ్రూప్ లోని పలు కంపెనీలకు ఆయన టాప్ పొజిషన్ లో పని చేశారు. టాటా ట్రస్ట్ బాధ్యతలను సైతం నిర్వహించారు. 

టాటా సంస్థలకు రిటైర్ మెంట్ ప్రకటించిన తర్వాత కూడా గ్రూప్ కు సంబంధించిన పలు కీలక నిర్ణయాల్లో ఆయన కీలక భూమికను నిర్వహించారు. రతన్ టాటాది, కృష్ణకుమార్ ది ఒకే వయసు కావడంతో ఇద్దరి మధ్య మంచి అనుబంధం కొనసాగింది. 2009లో కృష్ణకుమార్ ని భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆయన అంత్యక్రియలు ఈ సాయంత్రం ముంబైలోని చందన్ వాడీ శ్మశానవాటికలో జరగనున్నాయి.


More Telugu News