రూ. 8 వేల కోట్ల మార్కు దాటేసిన అవతార్2 వసూళ్లు
- తక్కువ కాలంలో 1 బిలియన్ యూఎస్ డాలర్లు రాబట్టిన చిత్రంగా రికార్డు
- జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం
- అవతార్1కి రికార్డు స్థాయిలో 2.9 బిలియన్ యూఎస్ డాలర్ల వసూళ్లు
దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ రూపొందించిన ‘అవతార్2: ది వే ఆఫ్ వాటర్' రికార్డుల పరంపర కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ చిత్రం అతి తక్కువ కాలంలోనే ఒక బిలియన్ యూస్ డాలర్ల వసూళ్ల మార్కును దాటేసింది. భారత కరెన్సీలో సుమారు రూ. 8 వేల కోట్ల మార్కును అందుకుంది. చిత్రం విడుదలై మూడు వారాలు దాటినా కలెక్షన్లు ఏమాత్రం తగ్గడం లేదు. ఉత్తర అమెరికాలో ఈ వారాంతంలో 82.4 మిలియన్ల డాలర్లు రాబట్టింది.
దాంతో, రికార్డు సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఒక బిలియన్ డాలర్ల మార్కు చేరుకుందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం అమెరికాలో 440.5 మిలియన్ డాలర్లు.. ఇతర దేశాల్లో 957 మిలియన్ డాలర్లను రాబట్టింది. ఇలా మొదటి రెండు వారాల్లోనే ఐదారు చిత్రాలు మాత్రమే ఒక బిలియన్ డాలర్ల వసూళ్లు సాధించాయి. కాగా, అత్యంత భారీ బడ్జెట్ చిత్రమైన అవతార్.. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రెట్టింపు వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. అవతార్1 చిత్రం రికార్డు స్థాయిలో మొత్తంగా 2.9 బిలియన్ డాలర్లు వసూలు చేసింది. అవతార్2 ఈ రికార్డును అధిగమిస్తుందో లేదో చూడాలి.