జీవితంలో నేను చేసిన పొరపాటు అదే: సీనియర్ నటి ప్రగతి
- అమ్మ .. అక్క .. వదిన పాత్రల్లో ప్రగతి పాప్యులర్
- పెళ్లి విషయంలో తొందరపడ్డానని వ్యాఖ్య
- హీరోయిన్ గా కొనసాగకపోవడానికి అదే కామరణమని వెల్లడి
తెలుగులో కేరక్టర్ ఆర్టిస్టుగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న సీనియర్ హీరోయిన్స్ లో ప్రగతి ఒకరు. సుధ తరువాత అమ్మ .. అక్క .. వదిన పాత్రల్లో ప్రగతి పాప్యులర్ అయ్యారు. 'అందమైన అమ్మ' అనే పేరు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో కూడా ప్రగతి చాలా యాక్టివ్ గా ఉంటారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె తన గురించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.
"హీరోయిన్ గా నా లైఫ్ సాగిపోతున్నప్పుడు నేను తీసుకున్న నిర్ణయం, నా కెరియర్ ను 10 నుంచి 20 ఏళ్లు వెనక్కు లాగేసింది. నేను చేసిన ఆ పొరపాటే ఎర్లీ మ్యారేజ్. అలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం వెనుక కోపం .. అమాయకత్వం .. మూర్ఖత్వం వంటివి ఉంటాయి. అన్నీ తెలుసు అనే ఒక అహంభావం కూడా ఆ ఏజ్ లో ఉంటుంది. పరిస్థితులు కల్పించుకుని మరీ, మనం అనుకున్నది జరగాలని చూస్తాము" అని చెప్పారు.
"చేసింది తప్పు అని గ్రహించి అందులో నుంచి బయటికి రావడానికి ప్రయత్నించడం కూడా ఆషామాషీ విషయమేం కాదు. నేను కేరక్టర్ ఆర్టిస్టుగా మారిన తరువాత ఎంత ఫోకస్ పెడుతున్నానో, హీరోయిన్ గా చేసేటప్పుడు కూడా అంతే ఫోకస్ పెట్టి ఉంటే నా లైఫ్ వేరేలా ఉండేది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే అందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదు" అని అన్నారు.