ధర్నాచౌక్‌కు వెళ్లకుండా రేవంత్‌రెడ్డి గృహ నిర్బంధం!
- సర్పంచ్ నిధుల సమస్యల పరిష్కారం కోరుతూ ఆందోళనకు సిద్ధమైన కాంగ్రెస్
- ధర్నాచౌక్ వద్ద అనుమతి లేదన్న పోలీసులు
- అయినా చేసి తీరుతామన్న కాంగ్రెస్ నేతలు
- కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పోలీసులు
సర్పంచ్ నిధుల సమస్యల పరిష్కారం కోరుతూ హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద ధర్నాకు సిద్ధమైన కాంగ్రెస్ నేతలకు పోలీసులు షాకిచ్చారు. రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో నేడు ధర్నా చౌక్ వద్ద ధర్నా చేయనున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. అయితే, ఇందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ ధర్నా చేసి తీరుతామని టీపీసీసీ ప్రకటించింది.
సర్పంచ్‌ల పోరాటానికి తాము మద్దతు ఇస్తున్నట్టు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి అన్నారు. సర్పంచ్‌లకు మద్దతుగా ఇందిరా పార్క్ వద్ద ధర్నాలో కాంగ్రెస్ నాయకులందరూ పాల్గొనాల్సిందిగా కోరారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. ధర్నా చౌక్‌కు వెళ్లకుండా కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇంటి చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. ఆయన బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారు.