పేలుడుతో దద్దరిల్లిన కాబూల్... 10 మంది మృతి
- ఎయిర్ పోర్టు వద్ద పేలుడు
- చెల్లాచెదురుగా మృతదేహాలు
- 8 మందికి తీవ్ర గాయాలు
ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లో భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. కాబూల్ లోని సైనిక విమానాశ్రయం ఎదుట జరిగిన ఈ పేలుడు ఘటనలో 10 మంది మరణించారు. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. మిలిటరీ ఎయిర్ పోర్టు మెయిన్ గేటు వద్ద భారీ విస్ఫోటనం సంభవించిందని తాలిబాన్ ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధి వెల్లడించారు.
కాగా, ఈ దాడికి తమదే బాధ్యత అని ఇంతవరకు ఎవరూ ప్రకటించలేదు. ఇటీవల తాలూఖాన్ నగరంలో పేలుడు జరిగి నలుగురు గాయపడగా, ఆ ఘటన జరిగిన మూడ్రోజుల తర్వాత కాబూల్ ఘటన చోటుచేసుకోవడం ఆఫ్ఘన్ లో భద్రత దిగజారిందన్న దానికి నిదర్శనంగా తెలుస్తోంది.