చైనాపై దలైలామా సంచలన ఆరోపణలు
- బౌద్ధాన్ని చైనా నాశనం చేయాలని చూస్తోందని ఆరోపణ
- ఈ ప్రయత్నంలో చైనా విజయం సాధించలేదని వ్యాఖ్య
- బీహార్ లోని బోద్‌గయ పర్యటనకు వచ్చిన దలైలామా
చైనాపై బౌద్ధ గురువు, బెట్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనాలో బౌద్ధాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కానీ, ఈ ప్రయత్నంలో చైనా విజయం సాధించదని అన్నారు. బౌద్ధమతాన్ని చైనా విషపూరితంగా పరిగణిస్తోందన్నారు. దాని సంస్థలను నాశనం చేయడం ద్వారా చైనా సంస్కృతిని నాశనం చేయడానికి ప్రచారం చేస్తోందని ఆరోపించారు.
‘బుద్ధ ధర్మంపై మాకు బలమైన విశ్వాసం ఉంది. స్థానిక ప్రజలతో పాటు మంగోలియా, చైనాలో కూడా దాని పట్ల చాలా అంకితభావంతో ఉన్నారు. అందువల్ల చైనా ప్రభుత్వం తన వ్యవస్థ ద్వారా ధర్మాన్ని విషంగా చూస్తుంది. దానిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తోంది, కానీ వారు ఎప్పటికీ విజయం సాధించలేరు. చైనా ప్రభుత్వం వల్ల బౌద్ధమతం దెబ్బతిన్నది. చైనా నుంచి బౌద్ధమతం నాశనం కాలేదు. నేటికీ, చైనాలో బౌద్ధమతాన్ని నమ్మే వారు చాలా మంది ఉన్నారు’ అని ఆయన అన్నారు.
చైనా ప్రభుత్వం అనేక బౌద్ధ విహారాలను నాశనం చేసినప్పటికీ, దేశంలో బౌద్ధమతాన్ని అనుసరించే వారి సంఖ్య తగ్గలేదని పేర్కొన్నారు. కొవిడ్-19 మహమ్మారి కారణంగా రెండేళ్ల విరామం తర్వాత బీహార్‌లోని బోద్‌గయాకు వార్షిక సందర్శనకు దలైలామా వచ్చారు. దలైలామా నేతృత్వంలో జరిగిన బోధనా కార్యక్రమానికి అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ సహా 80 వేల మందికి పైగా బౌద్ధ భక్తులు హాజరయ్యారు. కాగా, దలైలామా బీహార్ పర్యటన దృష్ట్యా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా బోధ్ గయలో ఆయనను కలిశారు.