ఆ ఒక్క విషయంలో చరణ్ కు, నాకు అస్సలు పోలిక లేదు: చిరంజీవి

  • వాల్తేరు వీరయ్యలో స్టిల్స్ 1991ను గుర్తుచేస్తున్నాయని వ్యాఖ్య
  • 30 ఏళ్ల తర్వాత కూడా తనలో అదే జోష్ కనిపిస్తోందన్న మెగాస్టార్
  • 80 ఏళ్లు వచ్చినా కుర్రవేషాలు వేయాలని ఉందన్న చిరు
మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చిరు చాన్నాళ్ల తర్వాత పూర్తి స్థాయి మాస్ పాత్రలో నటించడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో  కొన్ని స్టిల్స్‌ చూస్తుంటే.. 1991కి, ఇప్పటికీ తనలో తేడా లేదనిపిస్తోందని మెగాస్టార్ చిరంజీవి అంటున్నారు. 30 ఏళ్ల తర్వాత కూడా తనలో అదే జోష్‌ కనిపిస్తోందని చెప్పారు. ఈ సినిమాను ప్రేక్షకులు తప్పనిసరిగా ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తనకు 80 ఏళ్లు వచ్చిన యువకుడిలా అలరించాలని అనుకుంటున్నట్టు చిరంజీవి చెప్పారు. అంత వయసొచ్చినా కుర్ర వేషాలు వేయాలని ఉందని, ఇది ఇప్పటిదాకా ఎవ్వరికీ చెప్పని రహస్యం అన్నారు. ప్రముఖ తెలుగు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 

డిసెంబర్ 31న తాను యువకుడిగా ఉన్నప్పటి నుంచి అందరిలాగా పార్టీలకు వెళ్లేవాడిని కాదన్నారు. కాలేజీ రోజుల నుంచి పెళ్లైన చాలా రోజుల దాకా డిసెంబర్‌ 31 రాత్రి 11.30 నుంచి పూజ గదిలో ఆంజనేయస్వామి ముందు కూర్చుని ధ్యానం చేసుకొనేవాడినన్నారు. 12 గంటల తర్వాత టపాసుల చప్పుడు అయినప్పుడు లేచి అందరికీ శుభాకాంక్షలు చెప్పేవాడినని చెప్పారు. తన భార్య సురేఖ ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తోందన్నారు. తన కుమారుడు రామ్ చరణ్‌ తనలాగే అందరూ తన కుటుంబమే అనుకుంటాడని చిరు చెప్పారు.

అయితే, చరణ్‌ చాలా గుంభనంగా ఉంటాడు, తాను చాలా ఓపెన్‌గా ఉంటానని, ఈ ఒక్క విషయంలో మాత్రం తమ ఇద్దరికీ పోలిక లేదు. చరణ్–ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారన్న విషయం తెలిసి చాలా సంతోషపడ్డానని మెగాస్టార్ చెప్పారు. కొడుకు, కోడలు ఆ మాట చెబుతుంటే ఒక రకమైన ఉద్వేగానికి లోనయ్యానని, ఆ రోజు కోసం ఆరేళ్ల నుంచి వేచి చూస్తున్నామని అన్నారు.


More Telugu News