గతేడాది 172 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం!

  • 2022లో మొత్తం 93 ఎన్‌కౌంటర్లు
  • హతమైన వారిలో ఎక్కువమంది లష్కరే తోయిబా ఉగ్రవాదులే
  • అంతకుముందు ఏడాదితో పోలిస్తే 37 శాతం తగ్గిన టెర్రరిస్ట్ రిక్రూట్‌మెంట్లు
గతేడాది భారత సైన్యం కశ్మీర్‌లో 172 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. వీరిలో 42 మంది విదేశీ ఉగ్రవాదులు ఉన్నారు. మొత్తం 93 ఎన్‌కౌంటర్లలో వీరు హతమైనట్టు కశ్మీర్ పోలీసులు తెలిపారు. హతమైన ఉగ్రవాదుల్లో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా, ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)కు చెందిన వారు 108 మంది ఉన్నారు. ఆ తర్వాత వరుసగా జైషే మహ్మద్ (35), హిజ్బుల్ ముజాహిదీన్ (22), అల్ బదర్ (4), అన్సార్ ఘజ్వత్ ఉల్ హింద్ (3) ఉగ్రవాదులు ఉన్నట్టు కశ్మీర్ ఏడీజీపీ విజయ్ కుమార్ తెలిపారు. 

గతేడాది 100 మంది ఉగ్రవాదులు వివిధ ర్యాంకుల్లో చేరారు. గతేడాది ఉగ్రవాదుల్లో చేరినవారి సంఖ్య అంతకుముందు ఏడాదితో పోలిస్తే 37 శాతం తగ్గింది. మొత్తం రిక్రూట్ అయిన ఉగ్రవాదుల్లో 65 మందిని సైన్యం కాల్చి చంపింది. 17 మందిని అరెస్ట్ చేసింది. ఇంకా 18 మంది క్రియాశీలంగా ఉన్నారు.


More Telugu News