ఇంట్లో చోరీ.. దొంగల ఆచూకీ కోసం బాబా సాయం కోరిన పోలీసు అధికారి!

  • హర్యానాలోని పానిపట్ జిల్లా చాందినీబాగ్ పోలీస్ క్వార్టర్స్‌లో ఘటన
  • ఏఎస్సై ఇంట్లోని రూ. 40 తులాల బంగారం, రూ. 3.45 నగదు లక్షల చోరీ
  • దొంగలను పట్టుకోవడంలో సాయం చేయాలంటూ బాబాను ఆశ్రయించిన ఏఎస్సై
  • దొంగలు దొరికినా సొత్తు దొరకదన్న బాబా
ఆయనో పోలీసు. ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగలను పట్టుకుని చీల్చి చెండాల్సిన ఆయన వారిని పట్టుకునేందుకు సాయం చేయాలంటూ ఓ బాబాను ఆశ్రయించారు. బాబా కాళ్ల వద్ద కూర్చుని మాట్లాడుతున్న పోలీసు అధికారి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. డిసెంబరు 23న హర్యానాలోని పానిపట్ జిల్లా చాందినీబాగ్ పోలీస్ క్వార్టర్స్‌లోని ఏఎస్సై కృష్ణకుమార్ ఇంట్లో చోరీ జరిగింది. 40 తులాల బంగారం, రూ. 3.45 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. 

తాను పనిచేస్తున్న పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేసిన ఏఎస్సై కృష్ణకుమార్ దర్యాప్తు చేపట్టారు. దొంగల ఆచూకీ కోసం ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో దొంగలను పట్టుకునేందుకు సాయం చేయాలంటూ పండోఖర్ బాబా ఆశ్రమానికి వెళ్లారు. తన ఇంట్లో జరిగిన చోరీ గురించి ఆయనకు చెబుతూ దొంగలను పట్టుకోవడంలో సాయం చేయాలని కోరారు. స్పందించిన బాబా.. ఆ క్లూ మీ పోలీస్ క్వార్టర్స్‌లోనే ఉందని చెప్పారు. పంజాబ్ సరిహద్దులకు వెళ్తే దొంగలు దొరుకుతారని, అయినప్పటికీ పోయిన వస్తువులు తిరిగి వస్తాయన్న గ్యారెంటీ లేదని చెప్పారు.


More Telugu News