కళ్లు మిరుమిట్లు గొలిపే రీతిలో 2023కి స్వాగతం పలికిన సిడ్నీ నగరం... వీడియో ఇదిగో!
- నూతన సంవత్సరాదిని ఆహ్వానించిన పలు దేశాలు
- ఆస్ట్రేలియాలోనూ ఘనంగా సంబరాలు
- సిడ్నీలో 9 వేల రకాల బాణసంచా విన్యాసాలు
ప్రపంచంలోని పలు దేశాలు 2023 సంవత్సరానికి ఘనస్వాగతం పలికాయి. ఆస్ట్రేలియా కూడా నూతన సంవత్సరాదిని అట్టహాసంగా ఆహ్వానించింది. తూర్పు తీరంలోని సిడ్నీ నగరం బాణసంచా వెలుగులతో నిండిపోయింది. కళ్లు మిరుమిట్లు గొలిపే రంగురంగుల బాణసంచా ఆకాశంలో అద్భుతమైన వర్ణచిత్రాన్ని ఆవిష్కరించింది. లేజర్ లైటింగ్, విద్యుద్దీప కాంతులు, బాణసంచా వెలుగులతో సిడ్నీ హార్బర్, ఐకానిక్ ఓపెరా హౌస్, సిడ్నీ బ్రిడ్జి కనువిందు చేశాయి.
హార్బర్ బ్రిడ్జిపై 7 వేల రకాల బాణసంచా కాల్చారు. ఓపెరా హౌస్ వద్ద 2 వేల రకాల బాణసంచా కాల్చారు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో బాణసంచా విన్యాసాలు చేపట్టలేదు. ఓవైపు లైవ్ మ్యూజిక్ వినిపిస్తుండగా, సిడ్నీ వాసుల న్యూ ఇయర్ సంబరాలు మిన్నంటాయి. అటు, మెల్బోర్న్ నగరంలో 20 టన్నుల బాణసంచా కాల్చి, నూతన సంవత్సరాది క్షణాలను స్వాగతించారు.