వైఎస్ గురించి నేను విన్నది ఒకటి, చూసింది మరొకటి: జగ్గారెడ్డి
- ఓ మీడియా చానల్ కు జగ్గారెడ్డి ఇంటర్వ్యూ
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకిష్టమైన నేత అని వెల్లడి
- శత్రువునైనా ఆదరిస్తారని కొనియాడిన జగ్గారెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. తనకు ఇష్టమైన రాజకీయ నేత వైఎస్సార్ అని తెలిపారు. రాజశేఖర్ రెడ్డి గురించి తాను విన్నది ఒకటైతే, చూసింది మరొకటి అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
రాజశేఖర్ రెడ్డిని ఫ్యాక్షనిస్టు అనేవారని, అదొక చరిత్ర అని పేర్కొన్నారు. కానీ, రాజశేఖర్ రెడ్డిలో తాను బాగా గమనించిన అంశం... శత్రువునైనా ఆదరించే గుణం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. తాను సీఎం హోదాలో ఉన్నప్పటికీ, శత్రువు అయినా సరే కలవడానికి వస్తే ఆప్యాయంగా ఆదరించే స్వభావం రాజశేఖర్ రెడ్డి సొంతం అని జగ్గారెడ్డి కీర్తించారు. అప్పట్లో రాచరికపు రోజుల్లో రాజులు ఇలాంటి గొప్ప స్వభావాన్ని ప్రదర్శించేవారని పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీ పథకం కూడా ఎంతో గొప్ప పథకం అని తెలిపారు.
తన రాజకీయ వారసుల గురించి కూడా జగ్గారెడ్డి వెల్లడించారు. అనుకోకుండా తమ కుమార్తె రంగంలోకి దిగిందని, క్షేత్రస్థాయిలో తన భార్య కూడా రాజకీయ వ్యవహారాలు చూసుకుంటుందని, ఇప్పుడు అదనంగా తన కుమార్తె కూడా వచ్చిందని వివరించారు. అలాగని తన కుమార్తెను ఎన్నికల బరిలో పోటీ చేయించాలన్న ఆలోచన ఏదీ లేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. పెళ్లయ్యేంత వరకు ఆమె నియోజకవర్గ పనులు చూసుకుంటుందని తెలిపారు.