2023 సంవత్సరానికి స్వాగతం పలికిన పసిఫిక్ ద్వీపదేశాలు
- అందరికంటే ముందు కొత్త సంవత్సరంలో ప్రవేశించిన కిరిబాటి
- న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలోనూ మిన్నంటిన సంబరాలు
- జిగేల్మన్న ఆక్లాండ్ స్కై టవర్
ప్రపంచంలో అందరికంటే ముందుగా పసిఫిక్ ద్వీపదేశాలు 2023 సంవత్సరానికి స్వాగతం పలికాయి. కిరిబాటి, సమోవా, న్యూజిలాండ్ తదితర దేశాల్లో న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. తొలుత కిరిబాటి, టొంగా దేశాలు నూతన సంవత్సరాదికి ఆహ్వానం పలకగా, ఆ తర్వాత సమోవా దేశస్తులు కొత్త సంవత్సరంలోకి ప్రవేశించారు. సమోవా తమ టైమ్ జోన్ ను మార్చుకోవడంతో గంట ఆలస్యంగా 2023ని స్వాగతించింది.
భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు న్యూజిలాండ్ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. రంగురంగుల బాణసంచా విన్యాసాలతో ఆక్లాండ్ నగరంలోని స్కై టవర్ కాంతులు విరజిమ్మింది.
ఆస్ట్రేలియా కూడా 2023కి స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. ఆస్ట్రేలియా తూర్పు నగరాలు హోబర్ట్, బ్రిస్బేన్, మెల్బోర్న్, సిడ్నీలో నూతన సంవత్సర వేడుకలు మిన్నంటుతున్నాయి.