కందుకూరు మరణాలను రాజకీయం చేయడం జగన్ కు తగదు: రామకృష్ణ

  • మరణాలకు చంద్రబాబే కారణం అనడం సరికాదన్న రామకృష్ణ
  • అదే నిజమైతే చంద్రబాబుపై హత్యానేరం కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్న
  • విశాఖను చిన్న రాష్ట్రం చేయాలనడం ధర్మాన అవివేకానికి నిదర్శనమని విమర్శ
కందుకూరులో చంద్రబాబు సభలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో 8 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ మరణాలను ముఖ్యమంత్రి జగన్, ఆయన సలహాదారులు రాజకీయం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. చంద్రబాబు వల్లే ఈ మరణాలు సంభవించాయని అని అనడం సరికాదని... ఒకవేళ చంద్రబాబు వల్లే మరణాలు సంభవించి ఉంటే హత్యానేరం కింద కేసులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఏపీకి రాజధాని ఏర్పాటు చేయాలనే ఆలోచన జగన్ కు లేదని అన్నారు. విశాఖను చిన్న రాష్ట్రం చేయాలని అనడం మంత్రి ధర్మాన ప్రసాదరావు అవివేకానికి నిదర్శనమని, ఆయన మంత్రి పదవికి అనర్హుడని చెప్పారు.


More Telugu News