బంగారాన్ని తెగ కొనేస్తున్న ఆర్ బీఐ

  • రెండున్నరేళ్లలో 132.34 మెట్రిక్ టన్నుల కొనుగోలు
  • అన్ని కేంద్ర బ్యాంకుల్లో ఎక్కువగా కొన్నది మన కేంద్ర బ్యాంకే
  • ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మొత్తం నిల్వలు 785.35 టన్నులు
ఆర్ బీఐ బంగారాన్ని తెగ కొనేస్తోంది. 2020 ఏప్రిల్ నుంచి 2022 సెప్టెంబర్ వరకు 132.34 మెట్రిక్ టన్నుల బంగారాన్ని ఆర్ బీఐ కొనుగోలు చేసి ప్రపంచంలోనే నంబర్ 1 సెంట్రల్ బ్యాంక్ గా నిలిచింది. అదే కాలంలో మరే ఇతర కేంద్ర బ్యాంకుతో పోల్చి చూసినా మన రిజర్వ్ బ్యాంకే అత్యధికంగా కొనుగోలు చేసింది. 

2020 ఏడాది మొత్తం మీద 41.68 మెట్రిక్ టన్నులు (ఒక మెట్రిక్ టన్ను అంటే వెయ్యి కిలోలు), 2021లో 77.5 మెట్రిక్ టన్నులు, 2022లో సెప్టెంబర్ నాటికి 31.25 మెట్రిక్ టన్నుల చొప్పున బంగారాన్ని కొనుగోలు చేసింది. 2022 మార్చి చివరి నాటికి ఆర్ బీఐ వద్ద మొత్తం 760.42 మెట్రిక్ టన్నుల బంగారం పోగయ్యింది. 

ఇక సెప్టెంబర్ వరకు చూస్తే ఇది 785.35 మెట్రిక్ టన్నులకు చేరింది. దీంతో ఆర్ బీఐ వద్దనున్న విదేశీ మారకం నిల్వల్లో బంగారం నిల్వల వాటా 7.86 శాతానికి పెరిగింది. ప్రతి కేంద్ర బ్యాంక్ మారకం నిల్వల్లో కొంత మేర బంగారం రూపంలో కలిగి ఉంటుంది. అనిశ్చిత పరిస్థితులు, ఆర్థిక ప్రతికూలతల సమయాల్లో కరెన్సీ విలువల్లో వచ్చే మార్పుల రిస్క్ ను ఈ విధంగా హెడ్జ్ చేస్తుంటాయి.


More Telugu News