పంత్ మెదడు, వెన్నెముక నార్మల్.. ఎంఆర్ఐ స్కానింగ్ లో వెల్లడి
- రూర్కీ సమీపంలో కారు ప్రమాదంలో రిషబ్ కు గాయాలు
- ప్రస్తుతం డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స
- ముఖానికి అయిన గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన వైద్యులు
ఉత్తరాఖండ్‌లోని రూర్కీ సమీపంలో కారు ప్రమాదంలో గాయపడ్డ భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు ఎలాంటి ప్రమాదం లేదని తేలింది. మెదడు, వెన్నెముకకు నిర్వహించిన ఎమ్ఆర్ఐ స్కానింగ్ ఫలితాలు శనివారం వచ్చాయి. మెదడు, వెన్నెముకకు గాయాలు లేవని తేలింది. అతని చీలమండ, మోకాళ్లకు శనివారం ఎంఆర్ఐ స్కాన్‌లను నిర్వహించనున్నారు. కాగా, ప్రమాదంలో ముఖానికి అయిన గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేసినట్టు తెలుస్తోంది. డెహ్రాడూన్‌లోని మాక్స్ హాస్పిటల్‌లోని వైద్య సిబ్బంది పంత్ కి చికిత్స అందిస్తున్నారు.
పంత్ తన లగ్జరీ కారులో ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తుండగా ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. పంత్ కారు డివైడర్‌ను ఢీకొన్న కొద్ది నిమిషాలకే మంటలు చెలరేగాయి. ఓ బస్ డ్రైవర్ అతడిని కాపాడి ఆసుపత్రిలో చేర్చాడు. ఇక, శుక్రవారం రాత్రి ఆసుపత్రి విడుదల చేసిన మెడికల్ బులెటిన్ ప్రకారం పంత్ ఆరోగ్యం నిలకడగా ఉంది. అతను పూర్తి స్పృహలో ఉన్నాడని వైద్యులు తెలిపారు.