ఏపీఎస్ ఆర్టీసీ సంక్రాంతి స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరపై రాయితీ
- ఒకేసారి నాలుగు టికెట్లు కొంటే 5 శాతం తగ్గిస్తామన్న ఏపీఎస్ ఆర్టీసీ
- ముందే బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణం చార్జీలపై 10 శాతం తగ్గింపు
- పండుగ వేళ ప్రైవేటు ఆపరేటర్ల నుంచి పోటీని తట్టుకోవడానికేనన్న అధికారులు
- ఇప్పటికే వృద్ధులకు 25 శాతం రాయితీ ఇస్తున్న ఆర్టీసీ
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఏపీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒకేసారి నలుగురికి (పిల్లలు సహా) టికెట్లు కొంటే ఛార్జీలపై 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. తిరుగు ప్రయాణానికి కూడా ఇప్పుడే టికెట్లు బుక్ చేసుకుంటే ఆ టికెట్ల ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చని వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. పండుగ కోసం హైదరాబాద్ సహా వివిధ నగరాల నుంచి సొంతూళ్లకు పెద్ద సంఖ్యలో జనం వస్తుంటారు. ఈ సందర్భంగా రద్దీ పెరగడంతో ప్రైవేటు బస్ ఆపరేటర్లు టికెట్ రేట్లను ఇష్టానుసారంగా పెంచి, ప్రయాణికులను దోచేస్తుంటారు. దీనికి చెక్ పెట్టడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూ, లాభాలను ఆర్జించేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ఈ పథకానికి శ్రీకారం చుట్టింది.
పండుగ రద్దీని తట్టుకునేందుకు ప్రత్యేకంగా బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రకటించారు. జనవరి 6 నుంచి 18వ తేదీ వరకు 6,400 స్పెషల్ బస్సులను తిప్పుతామని వివరించారు. ఈ స్పెషల్ బస్సులలో కూడా సాధారణ బస్సుల ఛార్జీలు వసూలు చేయడంతో పాటు అదనంగా రాయితీని అమలు చేయనున్నట్లు తెలిపారు.
ఇప్పటికే వృద్ధులకు టికెట్ ధరపై 25 శాతం రాయితీ ఇస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా అధికారులు గుర్తుచేశారు. కుటుంబం సహా సొంతూరుకు వెళ్లే వారు తాజాగా ప్రకటించిన రాయితీతో తక్కువ ఖర్చుతో ప్రయాణించవచ్చని చెప్పారు. కాగా, ఈ-వాలెట్ ద్వారా చేసుకునే టికెట్ బుకింగ్ లకూ రాయితీ వర్తిస్తుందని అధికారులు తెలిపారు.