తల్లి పోయిన బాధలోనూ పంత్ కుటుంబానికి ఫోన్ చేసి మాట్లాడిన ప్రధాని మోదీ
- పంత్ తల్లికి ఫోన్ చేసి రిషబ్ ఆరోగ్యం గురించి ఆరా
- శుక్రవారం తెల్లవారుజామున పంత్ కు రోడ్డు ప్రమాదం
- అదే రోజు తల్లిని కోల్పోయిన ప్రధానమంత్రి
తల్లిపోయిన బాధలోనూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కారు ప్రమాదానికి గురైన క్రికెటర్ రిషబ్ పంత్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. పంత్ తల్లితో ఫోన్ లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని వారికి భరోసా కలిప్పించారు. పంత్ కారు ప్రమాదానికి గురయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసందే.
రూర్కీ సమీపంలో అతను నడుపుతున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. దూరంగా ఎగిరి పడిన అనంతరం కారులో మంటలు చెలరేగాయి. ఓ బస్సు డ్రైవర్ ప్రమాదాన్ని చూసి రిషబ్ ను కారులో నుంచి బయటకు తీయడంతో ప్రాణాపాయం తప్పింది.
విషయం తెలిసిన వెంటనే పంత్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. రిషబ్ పంత్ తల్లికి ఫోన్ చేసి.. అతడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు భారత క్రికెటర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ పంత్ గురించి ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
‘క్రికెటర్ రిషబ్ పంత్ కు జరిగిన ప్రమాద ఘటనతో నేను బాధపడ్డాను. తన ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు. కాగా, గురువారం అర్ధరాత్రి మోదీ తల్లి హీరాబెన్ కన్నుమూశారు. శుక్రవారం ఉదయం మోదీ ఆమెకు అంత్యక్రియలు నిర్వర్తించారు. అనంతం ఎప్పటిలాగానే పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.