మహిళా కోచ్ పై క్రీడాశాఖ మంత్రి లైంగిక వేధింపులు

  • హర్యానా క్రీడా మంత్రిపై అథ్లెటిక్స్ మహిళా కోచ్ పోలీసులకు ఫిర్యాదు
  • కలవాలని పదేపదే ఒత్తిడి చేశాడని ఆరోపణ
  • కలిసినప్పుడు అసభ్యంగా ప్రవర్తించారన్న బాధితురాలు
క్రీడా ప్రపంచం ఉలిక్కి పడే ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. ఒక జూనియర్ అథ్లెటిక్స్ మహిళా కోచ్ పై సాక్షాత్తు ఆ రాష్ట్ర క్రీడామంత్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. తనను క్రీడామంత్రి సందీప్ సింగ్ లైంగికంగా వేధించాడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ప్రతిపక్ష పార్టీ ఇండియన్ నేషనల్ లోక్ దళ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... క్రీడా మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేశారు. 

తనను తొలుత జిమ్ లో మంత్రి చూశాడని... ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ లో తనకు మెసేజ్ లు పెట్టేవాడని, తనను కలవాలని ఒత్తిడి చేసేవాడని ఆమె ఆరోపించారు. తాను స్పందించకపోవడంతో తనకు రావాల్సిన నేషనల్ గేమ్స్ సర్టిఫికెట్ ను పెండింగ్ లో ఉంచాడని... దీంతో ఆయనను తాను ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశానని చెప్పారు. ఆ సందర్భంగా తనతో ఆయన అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు. మరోవైపు దీనిపై మంత్రి స్పందిస్తూ... ఆమె చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలేనని ఖండించారు.


More Telugu News