పెళ్లికి నిరాకరించిన ప్రేయసి.. ఫేస్‌బుక్ లైవ్‌లో యువకుడి ఆత్మహత్య
- అసోంలోని గువాహటిలో ఘటన
- పెళ్లి చేసుకోబోనని అందరి ముందు చెప్పడంతో మనస్తాపం
- ఆమె లేకుండా తాను బతకలేనన్న యువకుడు
- క్షమించాలని తల్లిని వేడుకున్న వైనం
ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఫేస్‌బుక్ లైవ్‌లో ఉరేసుకున్నాడు. అసోంలోని గువాహటిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. కలాయిన్‌కు చెందిన జయ్‌దీప్ సిల్చార్‌లో ఓ గదిలో అద్దెకు ఉంటూ మెడికల్ సేల్స్ ప్రొఫెషనల్‌గా పనిచేస్తున్నాడు. కొన్నేళ్లగా ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు ఆమెపై ఒత్తిడి తీసుకురావడంతో జయదీప్‌కు దూరమైంది. పెళ్లికి నిరాకరించింది. యువతి నిర్ణయం విని తట్టుకోలేకపోయిన జయదీప్ తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు.
అంతకుముందు ఫేస్‌బుక్ లైవ్‌లో జయదీప్ మాట్లాడుతూ.. తాను ఆమెను ఎంతగానో ప్రేమించానని, పెళ్లి చేసుకుందామని అడిగితే అందరి ముందు తిరస్కరించిదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ తర్వాత వాళ్ల అంకుల్ వచ్చి ఆమెను మర్చిపోకుంటే చంపేస్తానని బెదిరించాడని ఆరోపించారు. తనవల్ల ఆమె బాధపడకూడదని, అందుకే చనిపోతున్నానని పేర్కొన్నాడు. ‘‘అమ్మా నన్ను క్షమించు. అంకుల్, ఆంటీ, అక్క, తమ్ముడు, బావ.. మీ అందరినీ ఎంతగానో ప్రేమించాను. మీ కంటే ఎక్కువగా నా గాళ్‌ఫ్రెండ్‌ను ప్రేమించాను. ఆమె లేకుండా నేను బతకలేను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని పేర్కొన్నాడు.
యువతి కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల జయదీప్ ఆత్మహత్య చేసుకున్నాడని అతడి సోదరుడు రూపమ్ రే ఆరోపించాడు. తమ కుటుంబాన్ని సోదరుడే పోషిస్తున్నాడని, బాగానే సంపాదిస్తున్నాడని పేర్కొన్నాడు. మరి పెళ్లి చేయడానికి యువతి కుటుంబ సభ్యులకు వచ్చిన ఇబ్బందేంటో తమకు అర్థం కాలేదని అన్నాడు. కాగా, ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, కాకపోతే మౌఖిక సమాచారం ఆధారంగా దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు తెలిపారు.