ఆ ముగ్గురు ఆటగాళ్లు ఇక పుంజుకోవడం కష్టమే: గంభీర్

  • కోహ్లీ, రోహిత్, రాహుల్ పై సెలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలన్న గంభీర్
  • ఇతరులకు అవకాశం ఇవ్వాలనుకుంటే అలాగే చేయాలని సూచన
  • ఈ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని స్పష్టీకరణ
టీ20 ఫార్మాట్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ల ఆటతీరుపై మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ స్పందించాడు. ఈ ముగ్గురు ఆటగాళ్లు మినీ ఫార్మాట్ లో పుంజుకోవడం కష్టమేనని అన్నాడు. ఈ ముగ్గురిపైనా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో సెలెక్టర్లు ఆలోచించుకోవాలని తెలిపాడు. 

వీళ్లను మించి ఇతర ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలనుకుంటే సెలెక్టర్లు ఇంకేమీ ఆలోచించకుండా తమ నిర్ణయాన్ని అమలు చేయాలని గంభీర్ స్పష్టం చేశాడు. అయితే ఈ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, ఆటగాళ్లకు, సెలెక్టర్లకు మధ్య ఎలాంటి అపోహలకు తావులేని రీతిలో నిర్ణయాలు ఉండాలని సూచించాడు. 

ఏదైనా జట్టులోని సీనియర్ ఆటగాళ్లను తొలగించినప్పుడు విమర్శలు రావడం సహజమేనని తెలిపాడు. ఆటలో వ్యక్తుల కంటే జట్టు ప్రయోజనాలే ముఖ్యమని గంభీర్ స్పష్టం చేశాడు. వచ్చే టీ20 వరల్డ్ కప్ కు సరైన ప్రణాళిక అవసరం అని, సీనియర్ల వల్ల కానిది సూర్యకుమార్ వంటి ఆటగాళ్లతో సాకారం కావొచ్చేమో కదా అని అభిప్రాయపడ్డాడు.


More Telugu News