నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- ట్రేడింగ్ చివర్లో నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు
- 293 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 85 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నం 2 గంటల వరకు లాభాల్లోనే ఉన్నాయి. ఆ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో నష్టాల్లోకి జారుకున్నాయి. క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 293 పాయింట్లు నష్టపోయి 60,840కి పడిపోయింది. నిఫ్టీ 85 పాయింట్లు కోల్పోయి 18,105 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (2.21%), టైటాన్ (1.77%), బజాజ్ ఫైనాన్స్ (1.03%), టాటా స్టీల్ (0.81%), టాటా మోటార్స్ (0.57%).
టాప్ లూజర్స్:
ఐసీఐసీఐ బ్యాంక్ (-1.74%), భారతి ఎయిర్ టెల్ (-1.56%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.44%), ఎల్ అండ్ టీ (-1.15%), నెస్లే ఇండియా (-1.13%).