జొమాటో ప్లాట్ ఫామ్ పై మళ్లీ గోల్డ్ మెంబర్ షిప్
- ఆహార ప్రియులకు గుడ్ న్యూస్
- ‘బ్యాక్ సూన్’ అంటూ ట్విట్టర్లో ప్రకటించిన జొమాటో చీఫ్
- కొంత కాలం క్రితం దీన్ని నిలిపివేసిన సంస్థ
ఫుడ్ ప్రియులకు జొమాటో త్వరలోనే గోల్డ్ మెంబర్ షిప్ ను ఆఫర్ చేయనుంది. కొంతకాలం క్రితం జొమాటో గోల్డ్ మెంబర్ షిప్ నిలిపివేసింది. తరచుగా జొమాటో ఆర్డర్లు చేసే వారికి గోల్డ్ సభ్యత్వంతో కొంత ఆదా అవుతుంది. జొమాటో గోల్డ్ అనే జిఫ్ ఇమేజ్ ను దీపిందర్ గోయల్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘బ్యాక్ సూన్’ అని క్యాప్షన్ పెట్టారు. అతి త్వరలోనే దీన్ని తీసుకురానుందని తెలుస్తోంది.
జొమాటో గోల్డ్ మెంబర్ షిప్ 2017 నవంబర్ నెలలో మొదలు కాగా, 2020 జూన్ నుంచి నిలిచిపోయింది. దీని స్థానంలో జొమాటో ప్రో పేరుతో సభ్యత్వాన్ని ప్రకటించింది. 2021లో జొమాటో ప్రో ప్లస్ ను కూడా తీసుకొచ్చింది. ఈ రెండింటినీ ఈ ఏడాది ఆగస్ట్ కు ముందు నిలిపివేసింది. అంతకుముందు జొమాటో గోల్డ్ సభ్యత్వ రుసుము మూడు నెలలకు రూ.299గా ఉండేది. ఏడాదికి రూ.999. కానీ, ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ ధరలే ఉండొచ్చని అంచనా. పోటీ సంస్థ స్విగ్గీలో ఇప్పటికే స్విగ్గీ వన్ అనే రాయల్టీ ప్రోగ్రామ్ ఉంది. దీనికి పోటీగా జొమాటో గోల్డ్ సభ్యత్వం ప్రయోజనాలు ఉంటాయని తెలుస్తోంది.