ప్రభాస్ .. ఇంతకీ పెళ్లి చేసుకుంటావా .. లేదా? : 'అన్ స్టాపబుల్ 2' వేదికపై ప్రశ్నించిన బాలయ్య!
- 'అన్ స్టాపబుల్ 2' స్టేజ్ పై ప్రభాస్
- ఆయన పెళ్లి గురించి ప్రస్తావించిన బాలయ్య
- ఇబ్బందిపడిపోయిన ప్రభాస్
- చేసుకుంటానని వెల్లడి
ప్రభాస్ పెళ్లి గురించిన వార్తలు సోషల్ మీడియాలో ఎప్పుడూ హల్ చల్ చేస్తూనే ఉంటాయి. అవి పుకార్లులుగా మిగిలిపోతూనే ఉంటాయి. ఈ విషయంలో ప్రభాస్ ఉద్దేశమేమిటనేది తెలుసుకోవాలనే ఆత్రుత ఆయన అభిమానుల్లో ఉంటుంది. తాజాగా ఇదే విషయాన్ని గురించి 'అన్ స్టాపబుల్ 2' స్టేజ్ పై ప్రభాస్ ను బాలయ్య అడిగేశారు. 'పెళ్లి చేసుకుంటావా .. లేదా?' అంటూ ఒత్తిడి చేశారు.
అందుకు ప్రభాస్ స్పందిస్తూ .. 'పెళ్లి చేసుకుంటాను సార్ .. రాసి పెట్టి ఉండాలి కదా' అన్నాడు. 'మీ అమ్మకి చెప్పిన మాటలు ఇక్కడ చెప్పకయ్యా. కొడుకు పెళ్లి చేసుకోవాలనీ .. కోడలితో కలిసి తిరుగుతూ ఉంటే చూడాలని ఆమెకి ఉంటుంది కదా" అని బాలయ్య అన్నారు. "ప్రస్తుతం మా సిస్టర్ మా అమ్మతోనే ఉంటుంది .. మా వదినా వాళ్లు ఆ పక్కనే ఉంటారు. ఇప్పటివరకూ అలా నడిచిపోతోంది" అంటూ ప్రభాస్ చెప్పాడు.
"ఆ మధ్య శర్వానంద్ ఈ షోకి వచ్చినప్పుడు .. 'పెళ్లెప్పుడయ్యా' అంటే, ప్రభాస్ చేసుకున్న తరువాత చేసుకుంటానని నీ పేరు చెప్పాడు" అని బాలయ్య అన్నారు. అందుకు ప్రభాస్ స్పందిస్తూ .. "అలా అయితే సల్మాన్ ఖాన్ చేసుకున్న తరువాత చేసుకుంటానని నేను చెప్పాలేమో" అంటూ నవ్వేశాడు. "ఏదైమా మీరంతా ఒక ముఠానయ్యా .. అదృష్టవంతులు" అని బాలయ్య నవ్వించారు.