జగన్ ను అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు.. వైసీపీ నేతలే జగన్ పై తిరుగుబాటు చేస్తున్నారు: నారా లోకేశ్

  • జగన్ నర్సీపట్నం పర్యటన సందర్భంగా విపక్ష నేతల అరెస్ట్
  • చెత్త పాలన, అసమర్థ సీఎం అంటూ వైసీపీ నేతలే తిరుగుబాటు చేస్తున్నారని ఎద్దేవా
  • వైసీపీ శ్రేణులే జగన్ ను అడ్డుకునే అవకాశం ఉందని వ్యాఖ్య
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా విపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. అరెస్ట్ చేసిన ప్రతిపక్ష పార్టీల వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అసలు జగన్ ను అడ్డుకోవాల్సిన అవసరం తమకు ఏ కోశానా లేదని చెప్పారు. చెత్త పరిపాలన, అసమర్థ ముఖ్యమంత్రి అంటూ వైసీపీకి చెందిన సొంత సామాజికవర్గం నేతలే ముఖ్యమంత్రిపై తిరుగుబాటు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల నేతల అరెస్టులు మాని... సీఎం పర్యటనలు ఉన్నప్పుడు వైసీపీ నేతల్ని అరెస్ట్ చెయ్యాలని పోలీసులను తాను ప్రత్యేకంగా కోరుతున్నానని అన్నారు. ఎందుకంటే చెత్త పరిపాలనపై ఒళ్లు మండిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆయన్ని అడ్డుకుని నిలదీసే అవకాశం ఉందని చెప్పారు.


More Telugu News