పాక్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో 10 వేల మంది ఉగ్రవాదులు: పాకిస్థాన్
- ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఉగ్రవాదులు పెద్దసంఖ్యలో ఉన్నారన్న పాక్ హోంమంత్రి
- వారి కుటుంబ సభ్యులు 25 వేల మంది కూడా వారితోనే ఉన్నారన్న రాణా సనావుల్లా
- రాష్ట్ర ప్రభుత్వం, ఉగ్రవాద వ్యతిరేక దళం వైఫల్యమే కారణమని ఆరోపణ
పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్.. ఈ రెండు దేశాలు ఉగ్రవాదుల పుట్టినిల్లుగా ప్రపంచం మొత్తానికి తెలుసు. ఉగ్రవాదులకు పాకిస్థాన్ స్వయంగా నిధులు సమకూరుస్తున్నట్టు ఆరోపణలున్నాయి. అంతేకాదు, ఉగ్రవాదులకు పాక్ భూతల స్వర్గం అని కూడా ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. అక్కడ ఉగ్రవాదులు యథేచ్ఛగా తిరగడం సర్వసాధారణమైన విషయం. సాక్షాత్తూ పాకిస్థాన్ హోంమంత్రి రాణా సనావుల్లా తాజాగా ‘డాన్ న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాల ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి.
పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాష్ట్రంలో 7 వేల నుంచి 10 వేల మంది వరకు తెహ్రీక్ ఎ తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) ఉగ్రవాదులు కాసుక్కూర్చున్నట్టు ఆ ఇంటర్వ్యూలో మంత్రి రాణా సనావుల్లా చెప్పారు. వారితోపాటు వారి కుటుంబ సభ్యులు మరో 25 వేల మంది అక్కడే ఉన్నట్టు తెలిపారు. నవంబరు నుంచి టీటీపీ ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం, ఉగ్రవాద వ్యతిరేక దళ విభాగం వైఫల్యమే ఇందుకు కారణమని ఆయన ఆరోపించారు. కాగా, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉండడం గమనార్హం.