శ్రీలీల ఆ దొంగతనం చేయవలసిందే: 'ధమాకా' ఈవెంటులో రాఘవేంద్రరావు

  • ఈ నెల 23న రిలీజ్ అయిన 'ధమాకా'
  • భారీ వసూళ్లతో దూసుకెళుతున్న సినిమా 
  • మాస్ మీట్ కి హాజరైన రాఘవేంద్రరావు
  • తన చిన్నప్పటి నుంచి రవితేజ అలాగే ఉన్నాడంటూ సరదా వ్యాఖ్య  
రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగిన కథతో .. ఆయన సినిమా నుంచి అభిమానులు ఆశించే కథనంతో త్రినాథరావు నక్కిన 'ధమాకా' సినిమాను తెరకెక్కించాడు. ఈ నెల 23వ తేదీన విడుదలైన ఈ సినిమా, భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ మీట్ ను 'మాస్ మీట్' పేరుతో హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ లో ఈవెంటును నిర్వహించారు. 

ఈ వేదికపై రాఘవేంద్రరావు మాట్లాడుతూ .. "సాధారణంగా గెస్టుగా ఎవరినైనా పిలిస్తే, చాలా బిజీగా ఉన్నప్పటికీ రాక తప్పలేదని చెబుతుంటారు. కానీ నిజానికి నేను అంత బిజీగా ఏమీ లేను. పైగా పిలవకపోయినా వచ్చాను. 5 వేల సంవత్సరాల క్రితం కృష్ణుడు ఫ్లూట్ ఊదితే 16 వేల మంది గోపికలు వచ్చారు. పీపుల్ మీడియా వారు కూడా అలాంటి ఫ్లూట్ ఏదో ఊదే ఉంటారు .. అందుకే డబ్బులే డబ్బులు. 

నాకు తెలిసి ఆ ఫ్లూట్ వాళ్ల ఆఫీసులో ఉందని అనుకుంటున్నాను. ఆ ఫ్లూట్ ను నిర్మాతల ఆఫీసు నుంచి దొంగతనంగా తీసుకురావలసిన బాధ్యత శ్రీలీలదే. ఆ ఫ్లూట్ ను ఒకసారి మా ఆర్కే ఆఫీసులో కూడా ఊది చూడాలి. ఇక రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. నా చిన్నప్పటి నుంచి ఆయన అలాగే ఉన్నాడు" అంటూ నవ్వులు పూయించారు.


More Telugu News