తిరుమల శ్రీవారికి స్వర్ణాభరణాలు సమర్పించిన కేవీఆర్ జ్యుయెలర్స్ అధినేత

  • కానుకల బరువు 1,756 గ్రాములు
  • విలువ రూ.1.30 కోట్లు
  • వైవీ సుబ్బారెడ్డికి అందించిన కేఆర్ నారాయణమూర్తి
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడికి కానుకలకు కొదవే లేదు. స్వామివారి ఖజానాలో ఎప్పటికప్పుడు కొత్త వస్తువులు వచ్చి చేరుతూనే ఉంటాయి. తాజాగా, చిత్తూరులోని కేవీఆర్ జ్యుయెలర్స్ అధినేత కేఆర్ నారాయణమూర్తి తిరుమల శ్రీవారికి స్వర్ణాభరణాలు సమర్పించారు. ప్రత్యేకంగా తయారుచేయించిన మూడు రకాల స్వర్ణాభరణాలు కేఆర్ నారాయణమూర్తి శ్రీవారి సన్నిధిలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. 

మూల విరాట్ కోసం ఒక జత కర్ణాభరణాలు, శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామికి విలువైన రాళ్లు పొదిగిన పతకాలు, మలయప్పస్వామికి బంగారు యజ్ఞోపవీతాన్ని విరాళంగా ఇచ్చారు. మేలిమి బంగారంతో తయారుచేసిన ఈ ఆభరణాల బరువు 1,756 గ్రాములు. వీటి విలువ రూ.1.30 కోట్లు ఉంటుందని కేఆర్ నారాయణమూర్తి వెల్లడించారు. 

కేవీఆర్ జ్యుయెలర్స్ అధినేత గతేడాది స్వామివారికి రూ.3 కోట్ల విలువైన బంగారు కటి, వరద హస్తాలను విరాళంగా ఇచ్చారు.


More Telugu News