'సీతారామం'లోని ఫీల్ .. '18 పేజెస్'లో ఉంది: అల్లు అరవింద్
- 'ఈ నెల 23న వచ్చిన '18 పేజెస్'
- సక్సెస్ మీట్ లో మాట్లాడిన అల్లు అరవింద్
- ఈ సినిమా చూస్తుంటే నవల చదివినట్టు ఉంటుందని వ్యాఖ్య
- నిఖిల్ తో మరో రెండు సినిమాలు చేస్తామని వెల్లడి
సుకుమార్ అందించిన కథను '18 పేజెస్' గా పల్నాటి సూర్యప్రతాప్ తెరపై ఆవిష్కరించాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా, ఈ నెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా ఈ సినిమా సక్సెస్ టాక్ ను తెచ్చుకుంది. దాంతో కొంతసేపటి క్రితం ఈ సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించారు.
ఈ వేదికపై అల్లు అరవింద్ మాట్లాడుతూ .. "ప్రేమకథలను ఇంట్లో కూర్చుని చూసేయవచ్చు అని అనుకుంటున్న తరుణంలో 'సీతారామం' వచ్చింది .. అదరగొట్టేసింది. 'సీతారామం' క్లైమాక్స్ లో ఉన్న ఆ ఫీల్ ఈ సినిమాలో కనిపించింది. చాలామంది ఆ సినిమాతో పోల్చి చెబుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది' అన్నారు.
ఈ కథను విన్నప్పుడే 'నవల' చదువుతున్నట్టుగా ఉందే' అనుకున్నాను. విజువల్ గా ఈ ఎఫెక్ట్ ను తీసుకురాగలమా అని నేను డైరెక్టర్ గారిని అడిగాను. 'తప్పకుండా తీసుకొస్తాను సార్' అని ఆయన కాన్ఫిడెంట్ గా చెప్పాడు. ఇప్పుడు ఈ సినిమా రెండో వారంలోకి ఎంటరవుతోంది. రిపీట్ ఆడియన్స్ వస్తే మూడో వారం కూడా కంటిన్యూ చేస్తాము. ఈ బ్యానర్ పై నిఖిల్ తో మరో రెండు సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాము" అంటూ చెప్పుకొచ్చారు. .
ఈ వేదికపై అల్లు అరవింద్ మాట్లాడుతూ .. "ప్రేమకథలను ఇంట్లో కూర్చుని చూసేయవచ్చు అని అనుకుంటున్న తరుణంలో 'సీతారామం' వచ్చింది .. అదరగొట్టేసింది. 'సీతారామం' క్లైమాక్స్ లో ఉన్న ఆ ఫీల్ ఈ సినిమాలో కనిపించింది. చాలామంది ఆ సినిమాతో పోల్చి చెబుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది' అన్నారు.
ఈ కథను విన్నప్పుడే 'నవల' చదువుతున్నట్టుగా ఉందే' అనుకున్నాను. విజువల్ గా ఈ ఎఫెక్ట్ ను తీసుకురాగలమా అని నేను డైరెక్టర్ గారిని అడిగాను. 'తప్పకుండా తీసుకొస్తాను సార్' అని ఆయన కాన్ఫిడెంట్ గా చెప్పాడు. ఇప్పుడు ఈ సినిమా రెండో వారంలోకి ఎంటరవుతోంది. రిపీట్ ఆడియన్స్ వస్తే మూడో వారం కూడా కంటిన్యూ చేస్తాము. ఈ బ్యానర్ పై నిఖిల్ తో మరో రెండు సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాము" అంటూ చెప్పుకొచ్చారు.