‘లక్కీ లక్ష్మణ్’ కంప్లీట్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌ .. అందరూ కలిసి ఎంజాయ్ చేస్తారు: సోహెల్

  • గతంలో బిగ్ బాస్ ద్వారా పేరు తెచ్చుకున్న సోహెల్ 
  • 'లక్కీ లక్ష్మణ్' తో పలకరించడానికి రెడీ 
  • తనకి కెమెరా వెనుక నటించడం రాదని వ్యాఖ్య
  • తన ఫ్యామిలీ జోలికి వస్తే ఊరుకోనని వెల్లడి 
  • ఈ నెల 30వ తేదీన విడుదలవుతున్న సినిమా
'బిగ్ బాస్' ఫేమ్ స‌య్య‌ద్ సోహైల్‌, మోక్ష హీరో హీరోయిన్లుగా న‌టించి చిత్రం ‘లక్కీ లక్ష్మ‌ణ్’. ద‌త్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ బ్యాన‌ర్‌పై ఎ.ఆర్‌.అభి దర్శ‌క‌త్వంలో హ‌రిత గోగినేని ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ 30న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్బంగా హీరో సోహైల్ మీడియాతో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించాడు. 

* హీరోగా సిల్వ‌ర్ స్క్రీన్ ఎక్స్‌పీరియెన్స్ గురించి .. 

- వ‌ర్క్ ప‌రంగా చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇక ప‌ర్స‌న‌ల్‌గా చూస్తే రెస్ట్ ఉండ‌టం లేదు. ఇక్క‌డ రెండు విష‌యాలున్నాయి. కామ‌న్ మ్యాన్‌గా ఉన్నప్పుడు ప‌రిస్థితులు ఒక‌లా ఉంటాయి. అదే సెల‌బ్రిటీ స్టేట‌స్ వచ్చిన‌ప్పుడు దాన్ని హ్యాండిల్ చేయ‌టం క‌ష్ట‌మైపోతుంది. కెమెరా వెనుక కూడా నేను నాలా ఒరిజిన‌ల్‌గా ఉండాల‌ని అనుకుంటున్నాను. ఇక్క‌డ కూడా యాక్ట్ చేయాలంటే నా వ‌ల్ల కావ‌టం లేదు. అదొక్క‌టే నాకు మైన‌స్ అవుతోంది. 

*నెగ‌టివ్‌గా తీసుకుంటున్నారు..

- ఉన్న‌ది ఉన్న‌ట్లు మాట్లాడితే కొంత మంది నెగటివ్‌గా తీసుకుంటున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ ముందు కామెంట్స్ చూసుకుని డిలీట్ చేస్తున్నాను. ఆ స‌మ‌యంలో కొంత మంది నా ఇంట్లో వాళ్ల‌ని టార్గెట్ చేస్తున్న‌ట్లు మెసేజెస్ పెట్టారు. మేము కూడా మ‌నుషుల‌మే మాకు కూడా ఎమోష‌న్స్ ఉంటాయి. ఇంట్లోని వాళ్ల‌ని కామెంట్ చేసే కామ‌న్ పీపుల్ ఎవ‌రైనా స‌రే! ఇచ్చిప‌డేసుడే. 

* ‘మిస్ట‌ర్ ప్రెగ్నెంట్’ కోసం వెయిటింగ్‌..

- బిగ్‌బాస్ నుంచి బ‌య‌ట‌కు రాగానే నేను సెల‌క్ట్ చేసుకున్న తొలి సినిమా 'మిస్ట‌ర్ ప్రెగ్నెంట్‌'. ఆ సినిమా ఎందుక‌నో ఆల‌స్యం అయ్యింది. దాని కోసం నేను ఏడాది పాటు వెయిట్ చేశాను. కానీ కాలేదు. ఆలస్యం కావ‌టంపై ఫీల్ అయ్యాను. 'మిస్ట‌ర్ ప్రెగ్నెంట్' సినిమా రిలీజైతే మంచి పేరు వ‌స్తుంది. డిఫ‌రెంట్ మూవీగా మంచి పేరు తెచ్చుకుంటుంది. ఆ సినిమా కోసం ఏడాది పాటు క‌ష్ట‌ప‌డ్డాను. కానీ సినిమా ఇంకా రిలీజ్ కాకపోవడం వలన కాస్త డిప్రెష‌న్‌కి లోన‌య్యాను.

* ‘లక్కీ లక్ష్మణ్’ సెలక్ట్ చేసుకోవటానికి కారణమదే..

- 'మిస్ట‌ర్ ప్రెగ్నెంట్' త‌ర్వాత 'బూట్ క‌ట్ బాల్‌రాజ్' అనే సినిమా ఒప్పుకున్నాను. అది మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌. 'ఆర్గానిక్ మామ - హైబ్రీడ్ అల్లుడు' కంప్లీట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్. ఫ్యామిలీతో స‌హా యూత్‌కు న‌చ్చే క్యూట్ ల‌వ్ స్టోరీ చేయాల‌నిపించింది. అప్పుడే 'ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్' ఒప్పుకున్నాను. సాధార‌ణంగా మ‌న లైఫ్‌లో క‌ష్టంతో పాటు అదృష్టం కూడా కావాలి. మ‌న చుట్టూ ఉన్న వారిలో ప‌ది మంది మాత్ర‌మే మ‌న మంచిని కోరుకుంటారు. అలాంటి రిలేష‌న్స్‌, మ‌న జీవితంలో జరిగే కొన్ని విష‌యాల‌ను కూడా ఇందులో చూపిస్తున్నాం.

*ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా..

- ల‌క్కీ ల‌క్ష్మ‌ణ్ కంప్లీట్ క్లీన్ కామెడీ. ఎక్క‌డా వ‌ల్గారిటీ ఉండ‌దు. నేను సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్‌గా క‌నిపిస్తాను. ఫ్యామిలీతో చూసేట‌ప్పుడు 'అరే .. ఈ సీన్ వ‌చ్చిందే' అని త‌ల తిప్పుకునేలా ఉండ‌దు. అంద‌రూ క‌లిసి సినిమా చూడొచ్చు.


* మా నాన్నగారి సపోర్ట్ వల్లే..

- మా నాన్న‌గారు నా స‌క్సెస్‌లో ఎంతో కీ రోల్ పోషించారు. మా కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. హార్ట్ ఆప‌రేష‌న్‌.. ఒక‌టే కిడ్నీ. బ్రెయిన్‌లో బ్ల‌డ్ క్లాట్ ఇన్ని స‌మ‌స్య‌లు ఓ వైపు.. మ‌రో వైపు మేం ఐదుగురు ఫ్యామిలీ మెంబ‌ర్స్‌. అంద‌రినీ క‌ష్ట‌ప‌డి పెంచాడాయ‌న‌. మా ఇంట్లో నాకు సినిమాల్లోకి వెళ‌తానంటే ఎవ‌రూ స‌పోర్ట్ చేయ‌లేదు. నాన్న‌గారు మాత్ర‌మే స‌పోర్ట్ చేశారు. ఇప్ప‌టికీ నేను టెన్ష‌న్ ప‌డుతుంటే .. ఎందుకు టెన్ష‌న్ ప‌డుతున్నావ‌ని ధైర్యం చెబుతుంటారు.

* ‘లక్కీ లక్ష్మణ్’ టెక్నికల్ టీమ్ గురించి..

- వంట చేసేట‌ప్పుడు అన్నీ చ‌క్క‌గా కుదిరితేనే రుచిగా ఉంటుంది. అలాగే సినిమాలో అన్ని విభాగాలు కలిసి పని చేస్తేనే మంచి సినిమా వ‌స్తుంది. అలాంటి మంచి టీమ్ మా 'లక్కీ లక్ష్మ‌ణ్' సినిమాకు కుదిరింది. 28 రోజుల్లో .. రెండు షెడ్యూల్స్‌లో సినిమాను పూర్తి చేశాం. సినిమాను క‌ల‌ర్‌ఫుల్‌గా తీశారు. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు.


More Telugu News