100 కోట్ల క్లబ్ దిశగా పరుగులుతీస్తున్న 'ధమాకా'
- రవితేజ హీరోగా వచ్చిన 'ధమాకా'
- తొలి ఆటతోనే దక్కిన హిట్ టాక్
- 6 రోజుల్లో 56 కోట్ల గ్రాస్ వసూలు
- ఈ వీకెండులోను ఈ సినిమాదే హవా
రవితేజ నుంచి ఈ ఏడాది ఆరంభంలోను .. మధ్యలోను ఫ్లాపులు రావడంతో ఆయన అభిమానులు చాలా నిరాశపడ్డారు. 'ధమాకా' సినిమా మాత్రం తప్పకుండా హిట్ కావాలని వాళ్లంతా కోరుకున్నారు. వాళ్లు అనుకున్నట్టుగానే ఈ సినిమా తొలిరోజునే సక్సెస్ టాక్ ను సంపాదించుకుంది. రవితేజ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకునేలా చేసింది.
ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల పరంగా ఈ సినిమా తన జోరును కొనసాగిస్తోంది. వీకెండ్ తరువాత కూడా ధైర్యంగా థియేటర్ల దగ్గర నిలబడిన ఈ సినిమా, 6 రోజుల్లో 56 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఈ శుక్రవారం ఓ అరడజను సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ, 'ధమాకా'కి పోటీ ఇచ్చే స్థాయిలో మాత్రం లేవు.
అందువలన ఈ వారంలో కూడా 'ధమాకా' దూకుడు కొనసాగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ వీకెండ్ తో కలుపుకుని ఈ సినిమా 100 కోట్ల క్లబ్ ను టచ్ చేయడం ఖాయమనే అంటున్నారు. రవితేజ మార్క్ కథ .. త్రినాథరావు మసాలా .. శ్రీలీల గ్లామర్ .. పాటలు .. డాన్సులు ... ఫైట్లు ఇలా అన్నీ అంశాలు కుదురుకోవడమే ఈ సినిమా ఈ స్థాయి హిట్ కొట్టడానికి కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. .
ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల పరంగా ఈ సినిమా తన జోరును కొనసాగిస్తోంది. వీకెండ్ తరువాత కూడా ధైర్యంగా థియేటర్ల దగ్గర నిలబడిన ఈ సినిమా, 6 రోజుల్లో 56 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఈ శుక్రవారం ఓ అరడజను సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ, 'ధమాకా'కి పోటీ ఇచ్చే స్థాయిలో మాత్రం లేవు.
అందువలన ఈ వారంలో కూడా 'ధమాకా' దూకుడు కొనసాగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఈ వీకెండ్ తో కలుపుకుని ఈ సినిమా 100 కోట్ల క్లబ్ ను టచ్ చేయడం ఖాయమనే అంటున్నారు. రవితేజ మార్క్ కథ .. త్రినాథరావు మసాలా .. శ్రీలీల గ్లామర్ .. పాటలు .. డాన్సులు ... ఫైట్లు ఇలా అన్నీ అంశాలు కుదురుకోవడమే ఈ సినిమా ఈ స్థాయి హిట్ కొట్టడానికి కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.