లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- 223 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
- 69 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- 2 శాతం వరకు లాభపడ్డ ఎయిర్ టెల్ షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు మధ్యాహ్నం తర్వాత మళ్లీ పుంజుకుంటూ చివరి అరగంటలో కొనుగోళ్ల మద్దతుతో పూర్తిగా లాభపడ్డాయి. అంతర్జాతీయంగా ప్రతికూలతలు ఉన్నప్పటికీ చివర్లో కొనుగోళ్ల అండ దొరకడం గమనార్హం. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 223 పాయింట్లు లాభపడి 61,133కి పెరిగింది. నిఫ్టీ 69 పాయింట్లు పుంజుకుని 18,191కి చేరుకుంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (1.99%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.85%), టాటా స్టీల్ (1.64%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.38%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.16%).
టాప్ లూజర్స్:
టాటా మోటార్స్ (-1.41%), టైటాన్ (-1.10%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.76%), హిందుస్థాన్ యూనిలీవర్ (-0.65%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.63%).