చంద్రబాబు సభలో దుర్ఘటనకు వైసీపీ ప్రభుత్వం, పోలీసులే కారణం: రఘురామకృష్ణరాజు
- వేలాది మంది హాజరవుతారని తెలిసినా పోలీసులు తగిన భద్రతను కల్పించలేదన్న రఘురాజు
- కాపులకు రిజర్వేషన్లు ఇవ్వక తప్పని పరిస్థితి జగన్ కు ఏర్పడిందని వ్యాఖ్య
- ముద్రగడ మంచి నాయకుడని కితాబు
కాపులకు ముఖ్యమంత్రి జగన్ రిజర్వేషన్లను కల్పించాల్సిందేనని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఈబీసీ కోటాలో కాపులకు రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని చెప్పారు. ఈ కోటాలో రిజర్వేషన్లను కల్పించడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం కోరాల్సిన అవసరం లేదని పార్లమెంటు సాక్షిగా కేంద్రం చెప్పిందని... ఈ నేపథ్యంలో, కాపులకు రిజర్వేషన్లను తప్పని సరిగా ఇవ్వాల్సిన పరిస్థితి జగన్ కు ఏర్పడిందని అన్నారు. జగన్ పాలనలో కాపుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పారు.
కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ కాపు నేత ముద్రగడ పద్మనాభం పది అడుగులు వెనక్కి తగ్గి జగన్ కు లేఖ రాశారని రఘురాజు అన్నారు. ముద్రగడ చాలా మంచి వ్యక్తి అని కితాబునిచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా కాపుల హక్కేనని చెప్పారు. తమకు ఎవరు కావాలనే విషయాన్ని కాపులు ఇప్పటికే తేల్చుకున్నారని తెలిపారు.
చంద్రబాబు సభ సజావుగా జరగకూడదని ప్రభుత్వం కోరుకుంటోందని... ఎనిమిది మంది మృతికి ప్రభుత్వం, పోలీసుల వైఫల్యమే కారణమని రఘురాజు అన్నారు. చంద్రబాబు వంటి నాయకుడి సభకు వేలాది మంది ప్రజలు హాజరవుతారని తెలిసినా పోలీసులు తగిన భద్రతను కల్పించలేదని విమర్శించారు.