చంద్రబాబుపై కేసు నమోదు చేయాలి: రోజా డిమాండ్
- ఎనిమిది మంది మృతికి చంద్రబాబు కారణమన్న రోజా
- కోర్టులు సుమోటాగా కేసులు నమోదు చేయాలని డిమాండ్
- మృతుల కుటుంబాలకు టీడీపీ రూ. 2 కోట్ల చొప్పున ఇవ్వాలన్న ఏపీ మంత్రి
నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు సభలో తొక్కిసలాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందటం అందరినీ కలచివేస్తోంది. మరోవైపు ఈ ఘటన నేపథ్యంలో ఏపీ మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. పబ్లిసిటీ పిచ్చితో ఎనిమిది మంది మృతికి చంద్రబాబు కారణమయ్యారని ఆరోపించారు.
చంద్రబాబుపై కోర్టులు సుమోటోగా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ రూ. 2 కోట్ల చొప్పున పరిహారం ఇవ్వాలని అన్నారు. నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్రను ప్రకటించిన రోజే ఆ పార్టీకి చెందిన ఎనిమిది మంది మృతి చెందారని చెప్పారు.