బీజేపీ మిషన్ తెలంగాణ.. 90 నియోజకవర్గాలపై గురి!
- వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు
- మిషన్ 90 తెలంగాణ 2023 పేరుతో కార్యాచరణ
- ఏడాది పాటు తెలంగాణపై ఫుల్ ఫోకస్
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. దీనికి తగ్గట్టుగానే బీజేపీ నేతలు కూడా దూకుడు పెంచుతున్నారు. పార్టీని క్షేత్ర స్థాయి వరకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. జాతీయ స్థాయి నాయకులు హైదరాబాద్ కు చేరుకుని వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఏడాది పాటు తెలంగాణపై ఫుల్ ఫోకస్ పెట్టాలని బీజేపీ అధిష్ఠానం ఇప్పటికే నిర్ణయించింది.
ఇందులో భాగంగా 'మిషన్ 90 తెలంగాణ 2023' పేరుతో కార్యాచరణ మొదలు పెట్టింది. ఏడాది పాటు చేపట్టబోయే పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన ఎన్నికల క్యాలెండర్ ను విడుదల చేయబోతోంది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో 90 స్థానాలను కైవసం చేసుకోవడమే బీజేపీ మిషన్ లక్ష్యం. కొంచెం బలహీనంగా ఉన్న 45 స్థానాల్లో బలమైన నాయకులను తీసుకొచ్చేలా చేరికల కమిటీని అధిష్ఠానం ఆదేశించింది. ఈ స్థానాల్లో పార్టీ కార్యకలాపాలను విస్తృత స్థాయిలో చేపట్టి, పార్టీని బలోపేతం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.