‘కందుకూరు’ బాధిత కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుంది: అచ్చెన్నాయుడు
- మాటలకందని విషాదమన్న అచ్చెన్నాయుడు
- తమ కుటుంబ సభ్యులైన కార్యకర్తల మృతి పార్టీకి తీరని లోటన్న లోకేశ్
- రాజకీయ సభలకు పోలీసులు బందోబస్తు కల్పించాలన్న సీపీఐ రామకృష్ణ
‘కందుకూరు’ బాధిత కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన.. టీడీపీ కుటుంబ సభ్యుల్ని కోల్పోవడం మాటలకు అందని విషాదమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.
చంద్రబాబు పర్యటనలో కందుకూరు ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. తమ కుటుంబ సభ్యులైన కార్యకర్తల మృతి పార్టీకి తీరని లోటని అన్నారు. బాధిత కుటుంబాలను పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కందుకూరు తొక్కిసలాట మృతుల కుటుంబాలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తన ప్రగాఢ సంతాపం తెలిపారు. అమాయకులు చనిపోవడం బాధాకరమని అన్నారు. ఈ ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, రాజకీయ సభలకు పోలీసులు బందోబస్తు కల్పించాలని రామకృష్ణ కోరారు.