తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి టెన్త్ పరీక్షలు

  • పదో తరగతి పరీక్షల వివరాలు తెలిపిన విద్యాశాఖ మంత్రి
  • వంద శాతం సిలబస్ తో పరీక్షలు జరుపుతున్నామన్న సబిత
  • 6 పేపర్లతో పరీక్షలు
  • ప్రతి పేపర్ కు 3 గంటల సమయం
  • సైన్స్ పేపర్ కు 3 గంటల 20 నిమిషాల సమయం
తెలంగాణలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. వంద శాతం సిలబస్ తో టెన్త్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 

2022-23 విద్యాసంవత్సరం నుంచే 6 పేపర్ల విధానం అమలు చేస్తున్నట్టు ఆమె వెల్లడించారు. ప్రతి పేపర్ కు 3 గంటల పరీక్ష సమయం కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. సైన్స్ పేపర్ కు మాత్రం 3 గంటల 20 నిమిషాల సమయం కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. 

పదో తరగతి విద్యార్థులకు ఫిబ్రవరి, మార్చిలో ప్రీ ఫైనల్ పరీక్షలు ఉంటాయని తెలిపారు. వ్యాస రూప ప్రశ్నలకు ఇంటర్నల్ చాయిస్, సూక్ష్మ రూప ప్రశ్నలకు నో చాయిస్ విధానంతో నమూనా ప్రశ్నాపత్రాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధనా తరగతులు ఏర్పాటు చేయాలన్నారు.


More Telugu News