తుపాకీలో తూటా ఎలా లోడ్ చేయాలో మర్చిపోయిన ఉత్తరప్రదేశ్ ఎస్సై... వీడియో ఇదిగో!
- ఖలీలాబాద్ పీఎస్ లో తనిఖీ చేసిన ఎస్పీ
- ఓ రౌండ్ కాల్చాలంటూ ఎస్సైకి తుపాకీ ఇచ్చిన వైనం
- తూటా లోడ్ చేయలేక బిత్తరచూపులు చూసిన ఎస్సై
- తుపాకీ బ్యారెల్ లోంచి లోడ్ చేసేందుకు యత్నం
- ముందుకు జారి చేతుల్లోకి వచ్చిన తూటా
ఎక్కడైనా గానీ పోలీసుల్లేని సమాజాన్ని ఊహించలేం. ప్రజల భద్రతకు భరోసా ఇచ్చే పోలీసులకు శిక్షణ సమయంలో అనేక రకాల ఆయుధాల వినియోగంలో తర్ఫీదునిస్తారు. అయితే చాలామంది పోలీసులకు ఆయుధాలు వినియోగించే సందర్భాలు ఎదురవడం తక్కువ. అందుకే అప్పుడప్పుడు ఉన్నతాధికారులు పోలీస్ స్టేషన్లను తనిఖీ చేస్తూ పోలీసు సిబ్బంది సన్నద్ధతను పరీక్షిస్తుంటారు.
ఉత్తరప్రదేశ్ లోనూ ఓ ఎస్పీ ఖలీలాబాద్ పీఎస్ ను తనిఖీ చేయగా, అక్కడి సబ్ ఇన్ స్పెక్టర్ కనీసం తుపాకీలో తూటా లోడ్ చేయడం కూడా తెలియక నవ్వులపాలయ్యాడు. షాట్ గన్ ను ఆ ఎస్సై చేతికిచ్చిన ఎస్పీ ఓ షాట్ కాల్చాలని ఆదేశించారు. తూటా కూడా అందించారు.
తుపాకీ అందుకున్న ఎస్సై... తూటాను ఆ తుపాకీలో ఎక్కడ లోడ్ చేయాలో తెలియక దిక్కులు చూశాడు. చివరికి ఆ తూటాను తుపాకీ గొట్టం ముందు భాగంలోంచి లోడ్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే తుపాకీ ముందుకు వంచగానే ఆ తూటా ముందుకు జారి చేతులోకి వచ్చేసింది. దాంతో అక్కడున్న వారందరూ నవ్వుకున్నారు. చివరికి ఆ సబ్ ఇన్ స్పెక్టర్ పరిస్థితి చూసి ఎస్పీకి కూడా నవ్వొచ్చింది.
దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై సమాజ్ వాదీ పార్టీ విమర్శనాస్త్రాలు సంధించింది. యోగి ప్రభుత్వం రాష్ట్ర పోలీసులకు ఏం నేర్పుతోందని ప్రశ్నించింది. పోలీసులు కనీసం తుపాకీ ఎలా కాల్చాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారంటూ ఎద్దేవా చేసింది.