ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ కు అస్వస్థత.. హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు

  • శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న హీరాబెన్  
  • అహ్మదాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స
  • ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోశ వ్యాధితో ఆమె బాధపడుతున్నారు. నిన్న రాత్రి ఆమె చాలా ఇబ్బందికి గురయ్యారు. దాంతో ఆమెను అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 

ఈ ఏడాది జూన్ లో ఆమె 99వ పడిలోకి అడుగుపెట్టారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా తన తల్లి హీరాబెన్ ను మోదీ కలిశారు. హీరాబెన్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తన తల్లిని చూసేందుకు మోదీ అహ్మదాబాద్ కు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అహ్మదాబాద్ లో భద్రతను పెంచారు.

మరోవైపు మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ ప్రయాణిస్తున్న కారు నిన్న రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో ఆయన కుమారుడు, కోడలు, మనవడు కారులో ఉన్నారు. కర్ణాటకలోని మైసూరు సమీపంలో వారు ప్రయాణిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కారు డివైడర్ కు గుద్దుకుంది. అయితే ఈ ప్రమాదంలో వారికి స్వల్ప గాయాలు మాత్రమే కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


More Telugu News