సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్‌పై పోలీసుల లాఠీచార్జ్.. కారణం ఇదే!
- మంగళవారం 57వ పుట్టిన రోజు జరుపుకున్న సల్మాన్
- సల్మాన్ ను చూసేందుకు ముంబైలోని ఆయన నివాసానికి పోటెత్తిన ఫ్యాన్స్
- బాల్కనీలో నుంచి సల్మాన్ అభివాదం చేయగానే తోసుకున్న ఫ్యాన్స్
బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్ మంగళవారం తన 57వ పుట్టినరోజును జరుపుకున్నారు. ఆయనకు శుభాకాంక్షలు చెప్పేందుకు ముంబైలోని ఆయన నివాసం వద్దకు అభిమానులు పోటెత్తారు. సల్మాన్ పోస్టర్లు, బ్యానర్లను పట్టుకొని వేలాదిగా తరలివచ్చారు. ఈ క్రమంలో సల్మాన్ తన బాల్కనీ నుంచి అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలను సల్మాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి సలీం ఖాన్‌తో కలిసి వచ్చిన సల్మాన్ అభిమానులను పలుకరించే ప్రయత్నం చేశారు.
ఆ సమయంలో ఫ్యాన్స్ ముందుకు తోసుకువచ్చారు. గట్టిగా అరుస్తూ, కేకలు వేస్తూ ఒకరినొకరు నెట్టుకోవడంతో నటుడి పుట్టినరోజు వేడుకలు హింసాత్మకంగా మారాయి. పోలీసులు జోక్యం చేసుకుని వారిని వెనక్కి నెట్టే ప్రయత్నం చేశారు. అయితే, జనం అదుపు తప్పడంతో పోలీసులు కొందరిపై లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. పోలీసులు లాఠీచార్జి ప్రారంభించిన వెంటనే అభిమానులు తమ పాదరక్షలు, ఇతర వస్తువులను వదిలి పారిపోయారు.