బీఆర్ఎస్‌కు షాక్.. కుమురం భీం జిల్లాలో 18 మంది ఆదివాసీ సర్పంచుల రాజీనామా
- వాంకిడి మండలానికి చెందిన సర్పంచుల రాజీనామా
- గ్రామాల్లో అభివృద్ది జరుగుతుందన్న ఆశతో పార్టీలో చేరామన్న సర్పంచులు
- అప్పట్లో చేసిన పనులకే ఇప్పటికీ బిల్లులు రాలేదని ఆవేదన
- సర్పంచులకు నచ్చజెబుతామన్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
కుమురం భీం జిల్లాలో బీఆర్ఎస్‌కు షాక్ తగిలింది. జిల్లాలోని వాంకిడి మండలానికి చెందిన 18 మంది ఆదివాసీ సర్పంచులు ఆ పార్టీకి రాజీనామా చేశారు. వాంకిడిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్పంచ్‌లు ఈ విషయాన్ని వెల్లడించారు. గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందన్న ఆశతో 2019లో పార్టీలో చేరామని, కానీ ఇప్పటి వరకు ఎలాంటి అభవృద్ధి జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తాము గెలిచి అధికారం చేపట్టిన తొలి రోజుల్లో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి ఇప్పటికీ బిల్లులు రాలేదన్నారు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పారు. ఈ విషయమై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి వారికి నచ్చజెబుతామని, సమస్యల పరిష్కారం కోసం సమష్టిగా కృషి చేస్తామని పేర్కొన్నారు.