'వాల్తేరు వీరయ్య' ఊహించినదానికి మించి ఉంటుంది: మెగాస్టార్
- 'వాల్తేరు వీరయ్య'గా చిరంజీవి
- సినిమా సెట్లో జరిగిన ప్రెస్ మీట్
- బాబీని అభినందించిన మెగాస్టార్
- అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుందని వ్యాఖ్య
చిరంజీవికి ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. అలాగే రవితేజకి ఉన్న మాస్ ఫ్యాన్స్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో 'వాల్తేరు వీరయ్య' సినిమా రూపొందింది. ఈ సినిమాలోని ప్రధానమైన సెట్ లో రొటీన్ కి భిన్నంగా ప్రెస్ మీట్ ను నిర్వహించారు.
ఈ స్టేజ్ పై చిరంజీవి మాట్లాడుతూ .. "ఇంతమంది సమష్టి కృషి లేకపోతే ఈ రోజున 'వాల్తేరు వీరయ్య' లేడు .. నేనూ లేను. ప్రతి ఒక్కరూ ప్రేమను పంచుతూ .. ప్రేమను పొందుతూ ఈ సినిమా కోసం పనిచేశారు. బాబీ వచ్చి ఈ కథను చెప్పినప్పుడు ఇందులో మేటర్ ఉందనే విషయం అర్థమైంది. ఇది తప్పకుండా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని ఆ రోజున చెప్పాను. ఆ ధైర్యంతోనే మైత్రీ వారు ఇంత మొత్తం ఖర్చు చేశారు" అన్నారు.
"మనల్ని అభిమానించేవారు డైరెక్టర్ అయితే .. ఆ డైరెక్టర్ తో తప్పకుండా సినిమా చేయి .. వాళ్లు చూపించినట్టుగా మనల్ని ఎవరూ చూపించలేరని ఒక సీనియర్ హీరో నాతో చెప్పారు. ఆ మాట నాలో బలంగా నాటుకుపోయింది. బాబీని చూసిన తరువాత అది నిజమేనని నాకు అర్థమైంది. ఈ సినిమా గురించి ఎంత ఊహించుకున్నా అంతకుమించే ఉంటుంది. శేఖర్ మాస్టర్ నా స్టైల్ పూర్తిగా పట్టేశాడనే విషయం నాకు అర్థమైంది. ప్రతి ఒక్కరూ ఎంతో అంకితభావంతో చేసిన ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ఆశిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.